దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ, అరటి పండ్లే పెడతారెందుకు!భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే ఎందుకు అగ్ర తాంబూలం?సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను పారేస్తాం. తిని పడేయడం వల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. వాటి నుంచి మొక్క వస్తుంది.మనం తిని పడేసిన విత్తనాల వల్ల వచ్చిన ఫలాన్ని ఎంగిలి ఫలంగా భావించి భగవంతుడికి నివేదించే విషయంలో కాస్త ఆలోచిస్తారు.అరటిపండుకి బీజం ఉండదు. ఓ అరటి చెట్టు నాటితే ఆ చుట్టూ వందల పిలకలు వస్తాయి కానీ అరటి పండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే ఎంగిలి కాని ఫలం అరటిపండు. దీన్ని పూర్ణఫలం అని కూడా అంటారు.ఇక కొబ్బరి కాయ కూడా అంతే. కొబ్బరి నాటితే కొబ్బరి మొక్క రాదు. మనం తిని పడేసిన పెంకు నుంచి , ముందే వలిచిన పీచు నుంచి కొబ్బరి మొక్క వచ్చే అవకాశమే లేదు.మన సంస్కృతి కేవలం భౌతికం మాత్రమే కాదు ఆధ్యాత్మికం కూడా. కొబ్బరికాయలో జీవిత సత్యం దాగిఉంది. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు.పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియచేసారు.మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం.కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు


Follow for more Web Stories: ABP LIVE Visual Stories