వాస్తుపరంగా ఈ దోషాలు లేకుంటే సంపదకు లోటుండదు



ఉత్తర దిశలో ఉన్న గోడకున్న అలమారలో డబ్బులు ఎప్పుడూ దాచకూడదు. ప్రతికూల ప్రభావం పడి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. తూర్పువైపు తిరిగి ఉండేలా అల్మరా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది.



వాస్తు ప్రకారం శ్రీ లక్ష్మీ గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవంటారు. లక్ష్మీ గణపతి విగ్రహం ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా ముఖం లోపలకు ఉండేలా ఉంచాలి.



ఇంటిపైకప్పు పై ఎప్పుడూ చెత్త వేయకూడదు. అనవసరమైన వస్తువులున్నీ పైన పెట్టే అలవాటు మానుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంటి యజమానికి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.



ఇంట్లో నీటికి సంబంధిత పాత్రలన్నీ ఉత్తరంవైపు ఉంచడమే మంచిది. ఎందుకంటే ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. ఇటువైపు పెట్టే నీటిపాత్రలు లీక్ అవ్వకూడదు.



వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు వైపు నీరు నిలిచేలా అంటే పల్లంగా ఉండాలి. ఇలాచేస్తే జీవితంలో వచ్చే సమస్యలు, అవరోధాలు సులభంగా పరిష్కరించుకుంటారు. ఇంటి సభ్యులు అభివృద్ధి చెందుతారు.



నీరు ఉత్తర దిశకు ప్రవహించినా మంచిదే. ఈ ఇంట్లో నివశించే వారికి ఎప్పుడూ అదృష్టం తోడుగా ఉంటుంది.నీరు పశ్చిమ దిశవైపు ప్రవహిస్తే అది అశుభం. ఆర్థిక నష్టం.



నీరు దక్షిణంవైపు పారితే ఆ ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి.



నీరు ఈశాన్యంవైపు పారితే ఈ ఇంట్లోవారికి ఎప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది, గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి.
ఈశాన్యం వైపు ఎత్తుగా ఉంటే ఈ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతాయి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంది.



నైరుతి వైపు వాలుగా ఉంటే ఈ ఇంట్లో ఉండేవారు వ్యసనాలకు బానిసవుతారు. ఈ ఇంట్లో ఉండేవారి స్వభావం సరిగా ఉండదు.



images credit: Pinterest