తన క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. చెన్నైకు చెందిన ప్రియాంక మోహన్ తండ్రి తమిళియన్, తల్లి కన్నడిగ. అయితే, ప్రియాంక కెరీర్ ప్రారంభించింది మాత్రం కర్ణాటకలో. కన్నడ చిత్ర సీమలో సెటిల్ అవుదామని ప్రియాంక తొలుత భావించింది. అదే సమయంలో ఆమెకు తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, ఆ చిత్రం ఆకట్టుకోలేదు. అదే ఏడాది తమిళంలో ‘డాక్టర్’, ‘డాన్’, ‘ఈటీ’ సినిమాల్లో అవకాశం వచ్చింది. ‘ఈటీ’ మినహా మిగతా రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రజనీకాంత్ 169వ సినిమాలో ప్రియాంక ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి ప్రియాంక తమిళంలోనే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. Credits: Priyanka Arul Mohan/Instagram