‘కంచె’ సినిమాతో కుర్రకారు గుండెల్లో సెటిలైపోయింది ప్రగ్యా. కానీ, ఆ తర్వాత ప్రగ్యాకు అవకాశాలు వచ్చినా లక్ కలిసిరాలేదు. ‘అఖండ’ సినిమాతో లక్ కలిసి వచ్చినా, అవకాశాలు మాత్రం రాలేదు. పగ్యా ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రగ్యా పారీస్‌లోని ఈఫెల్ టవర్, స్పెయిన్‌లోని బార్సిలోనాలో విహరించింది. ప్రస్తుతం గ్రీస్‌లోని శాంటోరినిలో ఎంజాయ్ చేస్తోంది. యోగా డే నేపథ్యంలో ప్రగ్యా యోగా చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అయితే, ఆ యోగా వీడియో ఇప్పటిది కాదు. గతేడాది రికార్డ్ చేసినది. దీంతో ఆమె ఫాలోవర్లు ‘తూచ్, ఇది మోసం’ అది పాత వీడియో అంటున్నారు. వీడియో పాతదైనా, కొత్తదైనా యోగా.. యోగానే కదండి!! Credits: Pragya Jaiswal/Instagram