ఎస్తర్ వాలెరీ నోరోన్హా.. సింగర్ నోయల్‌ను 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిప్రాయ బేధాల వల్ల ఏడాదిలోనే ఎస్తర్ విడాకులు తీసుకుంది. ఎస్తర్ 2012లో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో 3 సినిమాలు చేసింది. ఆ తర్వాత 2013లో తెలుగులో ‘1000 అబద్దాలు’, సునీల్‌తో ‘బీమవరం బుల్లోడు’ చేసింది. ఎస్తర్ వాస్తవానికి ఇండియన్ కాదట, ఆమె బహ్రెయిన్‌లో పుట్టిందట. ఎస్తర్ తండ్రి పూర్వికులది పోర్చుగీస్, తల్లిది కర్ణాటక. ఎస్తర్ కుటుంబం కొన్నాళ్లు గోవాలో ఉన్నారు. ఆ తర్వాత ఉడిపిలో సెటిలయ్యారు. ఎస్తర్ ఎనిమిదేళ్ల వయస్సులోనే కొంకణి సంగీతంతో పాపులరైంది. ఎస్తర్ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. ఛాన్సులు వచ్చినా, లక్ వరించలేదు. ఇటీవలే ఆమె నటించిన ‘రెక్కీ’ వెబ్ సీరిస్ విడుదలైంది. పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్తోంది. ‘రెక్కీ’లో ఎస్తర్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె కూడా ఆ పాత్రలో జీవించింది. Images Credit: Ester Noronha/Instagram