చికెన్ ఆమ్లెట్ చేసేయండిలా..

బోన్ లెస్ చికెన్ - 100 గ్రాములు
గుడ్డు - రెండు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - పావు స్పూను

బోన్‌లెస్ చికెన్‌ను చిన్న ముక్కలు చేసి ఉడకబెట్టుకోవాలి.

కళాయిలో నూనె వేసి ఉల్లిపాయల తరుగు, చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి.

చికెన్ ముక్కల మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో రెండు గుడ్లు కొట్టి అందులో చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా గిలక్కొట్టాలి.

పెనం వేడెక్కాక నూనె వేసి గుడ్ల మిశ్రమంలో ఆమ్లెట్‌లా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి.

ఆమ్లెట్ల చుట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.