ఉప్పుతో వాస్తు దోషాలు తొలగిపోతాయా? ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందా? దీనిపై వాస్తు పండితులు ఏం చెబుతున్నారు?

వాస్తు నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం ఉప్పు ఇంట్లో ఉండటం చాలా మంచిదంటారు. చాలా వాస్తు సమస్యలకు ఇది పరిష్కారం అంటారు.

ఉప్పు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది

పడక గదిలో ఉప్పు ఉంచితే అనారోగ్యం దరిచేరదు, బాత్‌రూమ్‌లో ఉప్పు పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట

ఎర్ర రంగు వస్త్రంలో ఉప్పు కట్టి ఉంచి గుమ్మానికి వేలాడదీస్తే దిష్టి, చెడు ప్రభావాలు తొలగిపోతాయి.

ఇంటి చుట్టూ ఉప్పు చల్లినా, చిన్న పాత్రలో ఉప్పునీరు ఇంటి ముందు ఉంచినా నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందట

ఇంటి ముందు ఉంచిన ఉప్పునీటిని రోజు గడిచిన తర్వాత డ్రైనేజ్ లోనో, బాత్ రూమ్ లోనో పోయొచ్చు

ఒత్తిడి లేదా మనసు ఆందోళనకరంగా ఉన్నట్లయితే ఉప్పును చిన్న పొట్లంలా చుట్టుకుని జేబులో పెట్టుకుంటే సత్ఫలితం ఉంటుందట.

నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లను పెట్టాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు.

వాస్తుకు మంచిదని అదేపనిగా ఇల్లంతా ఉప్పుతో నింపేసినా సమస్యే. నెగెటివ్ ఎనర్జీ తగ్గడం మాట దేవుడెరుగు..నెగటివ్ ఎనర్జీకి ఉప్పు వాహకంగా మారే ప్రమాదం ఉందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో వివరాల ఆధారంగా సేకరించిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం
Images Credit: Pinterest