నయనతార-విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట మొత్తం ఆస్తుల విలువ రూ.215 కోట్లు అని తెలుస్తోంది. నయనతార ఆస్తి దాదాపు రూ.165 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక విఘ్నేష్ ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందట. విఘ్నేష్ పేరు మీద రూ.20 కోట్ల విలువైన ఆమె మ్యాన్షన్ ఉందట. దాన్ని నయన్ గిఫ్ట్ చేసిందని చెబుతారు. అలానే వీరిద్దరూ కలిసి చెన్నైలో 4 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ కొన్నారు. ఇక నయనతారకు చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కేరళలో పలు ప్రాపర్టీస్ ఉన్నాయి. నయనతార ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. విఘ్నేష్ ఒక్కో సినిమాకి కోటి నుంచి మూడు కోట్లు తీసుకుంటారు. బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి నయన్ రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తుంది. ఆ విధంగా ఈ జంట లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది.