Horoscope Today 16 December 2021: ఈ రాశులవారు మాటల్ని కాస్త పొదుపు చేస్తే మంచిది... మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారులకు కలిసొస్తుంది. ఏ పనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు లభించదు. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవ్వరిపైనా అనవసర ఆరోపణలు చేయవద్దు. పెద్దల సలహాలు తీసుకుని కొత్తపనులు ప్రారంభంచండి.
వృషభం
దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ప్రముఖుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. సోమరితనం వీడండి.
మిథునం
అప్పు చేయాల్సి రావొచ్చు. స్థిరంగా మనస్తత్వాన్ని మెరుగుపరుచుకోండి. మాటల్లో పొదుపు అవసరం. కుటుంబం పట్ల ఆందోళన ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మొద్దు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
కర్కాటకం
వ్యాపారం బాగానే సాగుతుంది. జూదం, లాటరీల వలలో పడకండి. ఆకస్మికంగా బంధువులతో సమావేశం కావచ్చు. మీ జీవిత భాగస్వామి సలహాను పాటించండి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. భగవంతుని ఆరాధనతో మనోధైర్యం పొందుతారు.
సింహం
ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సంఘర్షణ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంటా- బయటా అశాంతి ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారం బాగాసాగుతుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం.
కన్య
కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఇంటా-బయటా ఆనందం ఉంటుంది. వివాహ ప్రతిపాదనను స్వీకరించవచ్చు. బిజీలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఒకరి మాటలు బాధించవచ్చు, కానీ టెన్షన్ పడకుండా ఉండండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు పెట్టుబడి సంబంధిత ఆఫర్లు పొందుతారు.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
తుల
కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆర్థిక విధానంలో మార్పులు తక్షణ ప్రయోజనాలను అందించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. వృత్తిపరమైన సమస్యలు దూరమవుతాయి. నిరుగ్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. పాత స్నేహితుడిని కలుస్తారు. సంతోషంగా ఉంటారు.
వృశ్చికం
వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏ బాధ్యతనైనా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంటారు. ఉన్నతోద్యోగుల సహకారం పొందుతారు. పూజల పట్ల ఆసక్తి ఉంటుంది.
ధనుస్సు
నిరుద్యోగులకు శుభసమయం. ఏదైనా పెద్ద పని చేయడానికి ప్రణాళిక ఉంటుంది. విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా వదిలేయవద్దు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆస్తులకు సంబంధించి కొనుగోలు, అమ్మకం మంచి లాభాలనిస్తుంది. ఉద్యోగులకు బదిలీ ఉండొచ్చు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
మకరం
ఓ పనిపై చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన పనుల్లో వేగం ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోండి. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కుంభం
మీకు శుభవార్త అందుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. పాత మిత్రులను, బంధువులను కలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పూర్వీకుల వ్యవహారాలు వేగవంతమవుతాయి. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం రావచ్చు. కోపాన్ని తగ్గించుకోండి. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం క్షీణించవచ్చు.
మీనం
ఉపాధి, ఆదాయం పెరుగుతాయి. యువత ఉద్యోగాలు పొందవచ్చు. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొంచెం కష్టపడినా మంచి లాభాలు పొందొచ్చు. మీ బాధ్యతలను చాలా వరకు నిర్వర్తించగలుగుతారు. మూర్ఖత్వాన్ని వదిలేయండి.
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి