Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023లో ఈ రాశివారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు
ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో సింహ రాశి ఫలితాలు
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో సింహరాశివారికి గురుడు అష్టమంలో, రాహువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. పట్టుదలతో శ్రమిస్తేనే విజయం సాధిస్తారు. ఈ ఏడాది కాలంలో మీరు సాధించే ప్రతి విజయం మీ స్వయంకృషి వల్ల మాత్రమే. ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే...
- శని ఆరవస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి ఉద్యోగులకు ఏడాదంతా అనుకూల సమయమే. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు, పై అధికారులతో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటారు
- మధ్యమధ్యలో గురు, రాహు గ్రహాల ప్రభావం వల్ల స్వల్పంగా సమస్యలు రావొచ్చు
- ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు.అనుకోని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి
- అవివాహితులకు తాము కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది
- ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి, అనాలోచిత నిర్ణయాలు తగవు, మీ శ్రీమతి సలహాను పరిగణలోకి తీసుకోండి
- విలువైన వస్తువులు, పత్రాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు
- వ్యాపారులకు సమాన్య ఫలితాలుంటాయి,హోల్ సేల్ వ్యాపారులకు-స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి బావుంటుంది
- మార్కెటింద్ రంగంలో ఉన్నవారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి
- వ్యవసాయ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది
- ర్యాంకులు కావాలనుకున్న విద్యార్థులు పట్టుదలతో శ్రమించాలి
- ఇంటి పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
- మీ పనిపై కన్నా ఇతరుల పనులు పూర్తిచేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు
- అప్పుడప్పుడు మానసికంగా డౌన్ అవుతూ..అంతలోనే మీకు మీరు సర్దిచెప్పుకోగలుగుతారు
- ఆరోగ్యం బాగానే ఉంటుంది,దేవుడిపై భక్తి పెరుగుతుంది
- ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
- సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఆవేశంగా అస్సలు మాట్లాడొద్దు
మొత్తంగా చూస్తే అష్టమ గురుడు ప్రభావంతో మీ శక్తిసామర్థ్యాల కన్నా తక్కువ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి.
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప