Spirituality: పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికతకూ గోవా ప్రత్యేకమే..
గోవా అంటే బీచ్ లు, పార్టీలు, పర్యాటకం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆధ్యాత్మికంగానూ గోవా ఎంతో విశిష్టమైనది. ఎన్నో పవిత్రదేవాలయాలున్నాయి. ముఖ్యంగా పరమశివుడు తనంతట తాను వచ్చి కొలువైన ఆలయం మరింత ప్రత్యేకం
గోవా ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగానే ఎంతో విశిష్టమైనది. ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదచార్యుల ఆశ్రమం ఇక్కడే ఉంది. సనాతన ధర్మానికి కొలువైన నేలలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టితమైన శ్రీమంగేష్ మందిరం ఉంది.
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
పనాజీకి 22 కి.మీ.దూరంలో ఉన్న శ్రీ మంగేష్ ఆలయం... స్థలపురాణం ప్రకారం ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతీదేవి చేతిలో ఓడిపోయిన శివయ్య..ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడట. అర్థనారీశ్వరుడిని అన్వేషిస్తూ అమ్మవారు ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఆ సమయంలో అమ్మవారని ఆటపట్టించేందుకు పులి రూపంలో మారిన భోళాశంకరుడు హఠాత్తుగా అమ్మవారి ముందు ప్రత్యక్షమయ్యారు. హఠాత్తుగా వచ్చిన పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం నిశ్చేష్టురాలై అనంతరం తేరుకుని ‘త్రాహి మాం గిరీశ’అంటూ ప్రార్థించింది. అంటే పర్వతాలకు ప్రభువైన దేవా రక్షించు అని. వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపంలోకి రావడంతో అమ్మవారి ఆనందానికి అవధుల్లేవు. మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారింది.
Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
జువారి నది ఒడ్డున అమ్మవారికి అయ్యవారు ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని ఫోర్చుగీసువారు ఆక్రమించి ఆలయాన్ని నిర్మూలించారు. అయితే కొందరు భక్తులు శివలింగాన్ని సమీపంలోని ప్రియల్‌కు తరలించి నాలుగు శతాబ్ధాల పాటు అక్కడే పూజలు నిర్వహించారు. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్ నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ ఉన్న ఎత్తైన దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన దేవాలయంతో పాటూ వినాయక, భైరవ, ముక్తేశ్వర్, గ్రామదేవత శాంతేరి, దేవి భగవతి.. దేవుళ్లు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు.
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి