అన్వేషించండి

Friendship Day 2023: ద్వాపరయుగంలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

మహాభారతంలో ఉత్తమ స్నేహితుల విషయానికొస్తే కర్ణుడు-దుర్యోధనుడు, కృష్ణుడు కుచేలుడిని ప్రధానంగా చెబుతారు. మిగిలిన స్నేహాలన్నీ కూడా కృష్ణుడి చూట్టూనే తిరుగుతాయి.

Friendship Day 2023: మహాభారతంలో ఉత్తమ స్నేహితులు వీళ్లే...

కృష్ణుడు-కుచేలుడు
స్నేహానికి అంతస్థులు అడ్డురావు, నిజమైన స్నేహం అంటే కష్టం చెప్పకముందే తెలుసుకుని సహాయం చేయడం. దీనికి ఉదాహరణ శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహ బంధం. కుచేలుడి అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానం మహా భాగవతం దశమ స్కందంలో ఈ వీరి ప్రస్తావన ఉంటుంది.  శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుధాముడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేస్తారు. విద్యాభ్యాసం అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారకకు, కుచేలుడు తన స్వగ్రామానకి వెళ్లిపోయారు. కుచేలుడు  బండెడు సంతానంతో దారిద్య్రాంలో ఉంటాడు. అప్పుడు నచ్చజెప్పిన కేచులుడి భార్య కృష్ణుడి దగ్గరకు వెళ్లిరమ్మంటుంది. ఓ చిన్న అటుకులమూట తీసుకుని వెళతాడు. ద్వారక చేరుకున్న కుచేలుడు అక్కడ భవనాలు, రాజప్రాకారాలు చూసి తనను కృష్ణుడ్ని కలవనిస్తారా అని సందేహపడతాడు. కానీ స్వయంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లి సకలమర్యాదలు చేస్తాడు కృష్ణుడు. ఆ సమయంలో కుచేలుడి అదృష్టం చూసి సభలో వారికి నోట మాటరాదు.  ఆ తర్వాత కుచేలుడితో నాకోసం ఏమైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు. అంత వైభవాన్ని అనుభవిస్తున్న కృష్ణుడికి తాను తెచ్చిన అటుకుల మూట ఇవ్వడం సరికాదని ఆలోచిస్తాడు. గమనించిన కన్నయ్య  అవి తీసుకుని గుప్పెడు అటుకులు తింటాడు. వెంటనే కుచేలుడికి సర్వసంపదలు కలుగుతాయి. ఆ తర్వాత సంతోషంగా సాగనంపుతాడు స్నేహితుడిని. 

Also Read: త్రేతాయుగంలో ఉత్తమ స్నేహితులు!

కర్ణుడు-దుర్యోధనుడు
తనను నమ్మి తనకు ఆశ్రయం ఇచ్చిన దుర్యోధనుడి కోసం ప్రాణాలిచ్చిన గొప్ప స్నేహితుడు కర్ణుడు.  పాండవులకి ఎదురు నిలిచే ధైర్యంలేని సమయంలో కర్ణుడు నేనున్నానంటూ దుర్యోధనుడికి అండగా నిలిచాడు. తాను అధర్మం వైపు నిలుస్తున్నానని కర్ణుడికి తెలుసు. కానీ తను అవమానానికి గురైనప్పుడు దుర్యోధనుడే తనకు అండగా నిలిచాడని గుర్తించుకుని ప్రాణం పోయే వరకు దుర్యోధనుడి వెంటే ఉన్నాడు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వెళ్తాడు. కర్ణుడికి పుట్టు పూర్వోత్తాలను వివరిస్తాడు. నువ్వు పాండవులకి అన్నవి. యుద్ధంలో పాండవుల వైపు ఉండి పోరాడు అని కోరుతాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఓ నవ్వు నవ్విన కర్ణుడు... "నా పుట్టుక గురించి తెలుసు. నేను పడ్డ అవమానాలు తెలుసు. ఈ యుద్ధంలో పాండవులే విజయం సాధిస్తారు.  నాకు మరణం తప్పదని తెలుసు. పాండవులు ధర్మాత్ములే అయినా కష్ట సమయంలో నా స్నేహితుడిని వదిలేసి ఎలా వస్తావని  అనుకున్నావు" అని అంటాడు. దుర్యోధనుడికి ఈ ప్రపంచంలో నన్ను మాత్రమే నమ్ముతాడని తనకు మాత్రమే కాదు దుర్యోధనుడు కూడా స్నేహానికి ఎంత విలువనిస్తాడో చెప్పాడు. నా స్నేహితుడి కోసం ప్రాణాలైనా విడుస్తానుగానీ తనకి ద్రోహం మాత్రం చెయ్యను అని కరాఖండిగా చెప్పేశాడు కర్ణుడు.

Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!

కృష్ణుడు-అర్జునుడు
సంతోషంగా ఉన్నప్పుడు మనచుట్టూ చాలామంది ఉంటారు కానీ కష్టం వచ్చినప్పుడు మనకి అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవాడే స్నేహితుడు. పురాణాల్లో ఇలాంటి స్నేహితులంటే కృష్ణార్జునులే. ఇద్దరూ బంధువులు కదా స్నేహం ఎక్కడుందని అనుకోవ్చచు కానీ అలా అయితే దుర్యోధనుడు కూడా బంధువే కదా...పాండవులతో ముఖ్యంగా అర్జునుడితో మాత్రమే ఎందుకంత సాన్నిహిత్యం. బంధాన్ని మించినది స్నేహం..కృష్ణార్జునులు బావ బావమరుదులే అయినప్పటికీ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. అందుకే బంధం ముందు తలవంచి యుద్ధం చేయను అని రథం దిగిపోయిన అర్జునుడికి బంధాన్ని దాటి బయటకురమ్మని బోధించాడు. అదే భగవద్గీత. మంచి స్నేహితుడిగా మారి అర్జునుడిలో ఉన్న విచారం, నిరాశ అన్నీ తొలగించి గెలుపుదిశగా నడిపించాడు. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget