By: RAMA | Updated at : 06 Apr 2023 08:46 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఆంజనేయుడి జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే చైత్ర మాసంలో హనుమాన్ జయంతి కొందరు జరుపుకుంటే వైశాఖ మాసంలో జరుపుకుంటారు ఇంకొన్ని ప్రాంతాల వారు. ఇంతకీ ఏ రోజు ఏం జరుపుకోవాలి... పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటారంటారు. ఉత్తరాది సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
"కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి..
శ్లోకం
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి
హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడితో యుద్ధానికి వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచి తిరిగి అయోధ్య చేరుకునే వరకూ శ్రీరామ విజయం వెనుక అడుగడుకునా భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక ఘట్టం ముగిసినతర్వాత రాముడు ఇలా అనుకున్నాడట " హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది, తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను, ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం , ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే" అని... ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పటి నుంచి... శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
''కలౌ కపి వినాయకౌ'' అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం.
ఏకాదశ రుద్రులలో ఒకడు ఆంజనేయుడు, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడు, సప్త చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికీ హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ జీవించి ఉన్నాడని విశ్వసిస్తారు. ఎక్కడ రామనామం జపిస్తారో, ఎక్కడ రామాయణం చెబుతుంటారో అక్కడ ఆనంద భాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తూ ఆంజనేయుడు కూర్చుని ఉంటాడట. రామకధ చెప్పే సభకు అందరి కన్నా ముందుగా వచ్చి అందరూ వెళ్లిపోయేవరకూ ఉంటాడట. హనుమంతుడిని పూజిస్తే రోగాలు నయమవుతాయి, భూతప్రేత పిశాచాలు పారిపోతాయి, చేసే పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది, శని బాధలు తొలిగిపోతాయి, బుద్ధి బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం పెరుగుతుందని పండితులు చెబుతారు...
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!
Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్టత తెలుసా!
జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి
Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది
Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్‌నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్