Ugadi Panchangam in Telugu (2023-2024): శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి
ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం
Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారికి గురుబలం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల ఈ ప్రభావంతో మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ ఉగాది నుంచి మీకు ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం...
- ఆర్థిక పరిస్థితి బావుంటుంది..రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది కానీ అవి చేతిలో నిలవవు
- భార్య భర్త మధ్య అన్యోన్యత బాగున్నప్పటికీ శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు వెంటాడతాయి, చీటీకి మాటికీ కోపతాపాలు తప్పవు
- ఆరోగ్యం పరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు...ముఖ్యంగా గుండెజబ్బులు, ఆస్మా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
- అనుకున్న పనులు సగంలో ఆగిపోతాయి..అసలు ఏం చేయాలనుకున్నారో కూడా మరిచిపోయే పరిస్థితి, ఇతరులను నమ్మి మోసపోతారు, తోటివారితో అభిప్రాయ బేధాలుంటాయి
భవిష్యత్ గురించి ఆతృత ఎక్కువగా ఉంటుంది - నిద్రలేమి బాధలు, దుష్ట కలలు వెంటాడతాయి, ఆప్తబంధువుల్లో ఒకరి మరణం మిమ్మల్ని బాధపెడుతుంది
- ప్రశాంతత ఉండదు.. ప్రతి పనీ అతి కష్టంమీద పూర్తవుతుంది
- ఇంట్లో పనులు పూర్తిచేస్తారు కానీ ఏదో ఆందోళన వెంటాడుతుంది..బయటకు చెప్పుకోలేక మానలేక ఇబ్బందిపడతారు
ఉద్యోగులకు
సింహ రాశి ఉద్యోగులకు శోభకృత్ నామ సంవత్సరంలో అక్టోబరు వరకూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి...ఆ తర్వాత నుంచి చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతాయి. అధికారుల వల్ల వేధింపులు, ఎంత పనిచేసినా కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, అనవసర ఆరోపమలు ఎదుర్కోక తప్పదు. చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్నవారికి పెద్దగా మార్పులుండవు..
వ్యాపారులకు
శోభకృత్ నామ సంవత్సరం వ్యాపారులకు బాగానే ఉంటుంది. అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోయినా నష్టపోవడం ఉండదు. ఫైనాన్స్ రంగం వారికి బావుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోతారు. నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లాభపడతారు.
విద్యార్థులకు
సింహ రాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం బావుండడం వల్ల చదువు పరంగా బావుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలవైపు ఆకర్షితులు కాకుండా..చదువుపై శ్రద్ధ పెడతారు. వివిధ కోర్సులకు ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు
వ్యవసాయదారులు
వ్యవసాయదారులకు మొదటి పంట లాభాలొస్తాయి కానీ రెండో పంట దిగుబడి తగ్గుతుంది. కౌలుదారులకు నష్టమే. నర్సరీ వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది
2023-2024 మేషరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....
రాజకీయ నాయకులకు
సింహ రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ఉన్నప్పటికీ పదవుల్లో వెలిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి. విజేతలుగా నిలవలేరు. చివరి నిముషంలో సమీకరణాలు మారిపోతాయి..డబ్బులు ఖర్చు అయినా అందుకు తగిన ఫలితం దక్కడం కష్టమే
కళారంగం వారికి
కళారంగం వారికి మొదటి ఆరు నెలలు బాగానే ఉన్నప్పటికీ ఏడాది ద్వితీయార్థం ఇబ్బందులు తప్పవు. కష్టానికి తగిన ఫలితం లేకపోగా.. నూతన అవకాశాలు కూడా రావడం కష్టం అవుతుంది
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
2023-2024 వృషభరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి