News
News
X

Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!

ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం..

FOLLOW US: 
Share:

Sri Sobhakritu Nama Samvatsaram 2023-2024:  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 వృషభ రాశి ఫలితాలు
(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆదాయం -14  వ్యయం - 11  రాజపూజ్యం-6  అవమానం-1

వృషభరాశివారికి ఈ ఉగాది నుంచి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురుడు 12 వ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైన ఫలితాలు పొందుతారు. శని, రాహువు మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. 

Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది

  • వృషభ రాశివారికి ఈ ఉగాది నుంచి సమయం కలిసొస్తుంది. అనుకున్న కోర్కెలు నెరవేరుతాయి, తలపెట్టిన పనులు పూర్తవుతాయి
  • భార్య-భర్త మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు
  • ఆదాయం బావుంటుంది, గతంలో చేసిన అప్పులు తీరుస్తారు
  • శత్రువులపై మీ ఆధిక్యత కొనసాగుతుంది, ఎంతటివారినైనా వశపరుచుకునే తెలివితేటలు మీ సొంతం
  • ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు...సాహసాలు చేయడానికి అస్సలు వెనకాడరు
  • విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది
  • ఉద్యోగులకు ఈ ఏడాది యోగదాయకంగా ఉంటుంది, మీకు అనుకూలమైన బదిలీలు జరుగుతాయి, కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది, గుర్తింపు లభిస్తుంది
  • ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఈ ఏడాది అది నెరవేరుతుంది
  • నిరుద్యోగులు ఉగాది తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది
  • రాజకీయనాయకులకు కూడా శోభకృత్ నామ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది, శత్రువులపై పైచేయి సాధిస్తారు, మంచి పేరు సాధిస్తారు
  • కళాకారులకు ఈ ఏడాది బావుంటుంది, టీవీ రంగంలో ఉన్నవారికి, గాయకులు, దర్శకులకు అన్నింటా విజయం, గుర్తింపు లభిస్తుంది
  • వ్యాపారులుకు రైజింగ్ హ్యాండ్ అనే చెప్పాలి. కేవలం ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి తప్ప మిగిలిన అన్ని రంగాల వారికీ అనుకూల ఫలితాలున్నాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగా కలిసొస్తుంది.
  • విద్యార్థులకు మాత్రం శోభకృత్ నామసంవత్సరంలో అంతగా కలసిరాదు. ఎందుకంటే..గురుడు 12 వ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది, పోటీ పరీక్షలు రాసేవారు మంచి  ఫలితాలు పొందలేరు
  • క్రీడాకారులకు బావుంటుంది
  • ఈ రాశి వ్యవసాయదారులకు కూడా ఒక పంటమాత్రమే కలిసొస్తుంది..మరో పంట వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టాల్సి రావొచ్చు...చేపలు, రొయ్యల చెరువుల వారికి మాత్రం గతేడాది కన్నా మెరుగ్గా ఉంది
  • హఠాత్తుగా తీసుకునే మొండినిర్ణయాలను మరోసారి పునః పరిశీలించుకోవడం మంచిది
  • జూన్ 18 నుంచి నవంబరు 4 మధ్య...అప్పటి వరకూ రాజ్యస్థానంలో ఉన్న శని వక్రంలో సాగనున్నాడు...ఆ సమయంలో ఉద్యోగులు జాగ్రత్తపడాలి
  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కృత్తిక నక్షత్రం వారికి సభాగౌరవం, అవార్డులు
  • రోహిణి నక్షత్రం వారికి వివాహాది శుభయోగం
  • మృగశిర నక్షత్రం వారికి ఇతరులతో సత్సంబంధాలు

Also Read: మిథున రాశిలోకి కుజుడు, ఈ 4 రాశులవారికి రెండు నెలల పాటు మానసిక ఒత్తిడి తప్పదు

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 

Published at : 11 Mar 2023 05:46 AM (IST) Tags: Sobhakritu Nama Samvatsaram rasi phalau Horoscope 2023-2024 2023 sri Sobhakritu nama samvatsara ugadi rasi phalalu 2023-2024 ugadi astrology predictions 2023 Vrushaba Rasi 2023-2024 Yearly in Telugu

సంబంధిత కథనాలు

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

టాప్ స్టోరీస్

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

Seediri Appalraju : సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి అత్యవసర పిలుపు - ఏం జరుగుతోంది ?

Seediri Appalraju :  సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి అత్యవసర పిలుపు -  ఏం జరుగుతోంది ?

నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

నాటు నాటు  పాట కోసం 19 నెలలు -  చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన