By: RAMA | Updated at : 09 Mar 2023 05:59 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Mars Transit 2023 ( కుజుడి సంచారం): జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారుతుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ధైర్యాన్ని ఇచ్చే కుజుడు త్వరలో తన రాశిని మారుతున్నాడు. 5 నెలల తర్వాత అంగారకుడు వృషభరాశి నుంచి బయలుదేరి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి సంచారం మిథున రాశిలో మార్చి 12 నుంచి మొదలే మే 10 వరకూ ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశిలో సంచరించనున్నాడు కుజుడు ( అంగారకుడు). మిథున రాశిలో కుజుడి సంచారం వల్ల నాలుగు రాశులవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి
అంగారక గ్రహం మిథున రాశిలో సంచరించడం మీకు అనుకూలం కాదు. ఈ సమయంలో మీరు మీ మాటను అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. మాట విసరకుండా తగ్గి మాట్లాడటం మంచిది. పిల్లలకు మీ సహకారం చాలా అవసరం. కార్యాలయంలో సహోద్యోగులతో కూడా మాట పట్టింపులు ఉండొచ్చు.
మిథున రాశి
మీ రాశిలో కుజుడి సంచారం ప్రభావం మీపై ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. ఈ సమయంలో మీరు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. కార్యాలయంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు బదిలీలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో తరచూ వాదనలు జరుగుతాయి.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
వృశ్చిక రాశి
కుజుడు రాశి మార్పు వృశ్చిక రాశి వారికి కూడా అంతగా కలసిరాదు. మిథునంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి మానసిక సమస్యలు తప్పవు. వ్యతిరేక రాజయోగం ఉంటుంది. డ్రైవింగ్ చేసటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
మిథున రాశిలో కుజుడి సంచారం అంటే..ధనస్సు నుంచి ఏడో రాశిలో సంచరిస్తున్నట్టు. ఈ సమయంలో ధనస్సు రాశివారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొంతమంది మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. రక్తపోటు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
Also Read: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఎప్పుడొచ్చింది, పంచాంగ శ్రవణం ఎందుకు!
భూమికి పుత్రుడు కుజుడు. ఈ గ్రహం ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. గొడవలకు ప్రేరేపిస్తాడు. శరీరంలో మలినాలు,విషం తొలగిస్తాడు. కుజగ్రహ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేస్తాడు. కామాన్ని, వ్యసనాలని ప్రేరేపిస్తాడు. రాహువుతో కలిస్తే ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.. రవితో కలిస్తే సమాజం కోసం పోరాటం చేస్తారు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రమణ్యస్వామి ఈ స్వామిని పూజిస్తే కుజుడి ప్రభావం తగ్గుతుంది.
నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం
వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!