Hinduism: సనాతన హిందూ మతం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలుసా!
Hinduism: సనాతన హిందూమతం ఎప్పుడు ఉద్భవించిందో నేటికీ చాలా మందికి తెలియదు. ఇప్పటికీ దాని ఆవిర్భావం గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా వేలాది సంవత్సరాలుగా హిందూ మతం ఉందని తెలుస్తోంది.
Hinduism: ప్రతి మతానికి దాని సొంత మూలం ఉంది కానీ హిందూ మతం మూలం లేదా ప్రారంభం గురించి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, నేటికీ, హిందూ మతం మూలం ఏమిటో, ఆవిర్భావం ఎలా జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో సనాతన హిందూమతం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం.
గురునానక్
సిక్కు మత స్థాపకుడు గురునానక్ 1469 ఏప్రిల్ 15న జన్మించారు. సెప్టెంబర్ 22, 1539న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. భారతదేశంలో హిందూమతం గురు సంప్రదాయానికి చెందిన మొత్తం 10 మంది గురువులతో రక్షణ పొందాయి. గురునానక్ కాలాన్ని తీసుకుంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే హిందూ మతం ఉందని చెప్పవచ్చు.
Also Read : 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!
జులేలాల్
సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులను రక్షించడానికి వరుండేవ్ జులేలాల్‌గా అవతరించాడు. పాకిస్థాన్‌లో జులేలాల్జీని జింద్ పీర్, లాల్షా అని పిలుస్తారు. ఇతడు క్రీ.శ.1007లో జన్మించాడు. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హిందూ మతానికి 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసించేవారు.
హర్షవర్ధన చక్రవర్తి
భారతీయుల్లో గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు 590 AD లో జన్మించాడు, 647 AD లో మరణించాడు. హర్షవర్ధనుడు అరేబియాపై దాడి చేసినట్టు ప్రస్తావనలు ఉన్నాయి. కానీ అతను ఎడారి ప్రాంతంలో పట్టుబడ్డాడని భైవ పురాణంలో ప్రస్తావన ఉంది. హర్షవర్ధనుడి హయాంలో చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ వచ్చాడు.
గురు గోరఖ్‌నాథ్
రాహుల్ సాంకృత్యాయన్ ప్రకారం, గొప్ప యోగి గురు గోరఖ్‌నాథ్ 845 ADలో జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గురు గోరఖ్‌నాథ్ ఆలయం 9వ శతాబ్దంలో పునరుద్ధరించారని పేర్కొన్నారు. గోరఖ్‌నాథ్ చాలా కాలం జీవించాడు. అతను హిందూ మతంలోని శైవ శాఖకు చెందిన ముఖ్యమైన సాధువు.
ఆదిశంకరాచార్య
ఆదిశంకరాచార్య హిందూమతాన్ని పునర్వ్యవస్థీకరించారు. క్రీ.శ.788లో జన్మించిన ఆయన క్రీ.శ.820లో 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టారు. కేరళలో జన్మించిన ఆయనను కేదార్‌నాథ్‌లో ఖననం చేశారు. ఆయన హిందూ మతానికి చెందిన గొప్ప సాధువు.
Also Read : భగవద్గీతను పూజించాలా - అనుసరించాలా!
2వ చంద్రగుప్తుడు
చంద్రగుప్త II చక్రవర్తికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అతని పాలన 380 AD నుండి 412 AD వరకు కొనసాగింది. మహాకవి కాళిదాసు అతని ఆస్థాన కవి. ఇవన్నీ చూస్తే సనాతన హిందూ ధర్మం ఎంతో పురాతనమైనదని, ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉందని అర్థమవుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.