Chanakya Niti in Telugu: దేశ ఆర్థిక స్థితి ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది - చాణక్య నీతి
దేశ ఆర్థిక స్థితి బావున్నప్పుడే పాలకులు మంచి పరిపాలన అందించగలరు..ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టగలరు. మరి దేశ ఆర్థిక స్థితి బావుండాలంటే ఏం చేయాలి? దీనిగురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!
Chanakya Niti in Telugu : ఆచార్య చాణక్యుడి ప్రతి సూచనా పాలకులకు మార్గనిర్దేశనం చేస్తుంది. చంద్రగుప్తుడు రాజు కావడానికి ముందు చాణక్యుడు రాసిన పుస్తకాన్ని అనుసరించి సమర్థుడైన రాజుగా ఎదిగాడని కొందరంటే..చంద్రగుప్తుడిని చక్రవర్తిగా నిలబెట్టిన తర్వాతే ఆ అనుభవంతో చాణక్యుడు తన అనుభవాలను ఓ పుస్తకంలో పొందుపరిచాడని మరికొందరు అంటారు. ఇందులో ఏది నిజమైనా కానీ...చాణక్యుడు ఊహించి బోధించిన మాటలు కావివి..దీనివెనుక ఎన్నో అనుభవాలున్నాయని అర్థమవుతుంది. అయితే పాలన, పాలకుడి గురించి ఎన్నో సూచనలు చేసిన చాణక్యుడు... దేశ ఆర్థిక స్థితి గురించి ప్రత్యేకంగా వివరించాడు. ముఖ్యంగా ఈ మూడు విషయాలపైనే ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుందని వివరించాడు.
1. వ్యవసాయం
2. పశుపోషణ
3. వాణిజ్య వ్యవసాయం
Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
వ్యవసాయం
వ్యవసాయం బావున్నప్పుడే పాలకులకు భూమినుంచి అధిక పన్ను వసూలవుతుంది.ప్రజలకు ఆహార ధాన్యాలకు కొరత ఉండదు. ఆహార ధాన్యాలకు కొరత లేనప్పుడు కరవు ఏర్పడే పరిస్థితే ఉండదు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు. ఫలితంగా ఖజానాపై భారం తగ్గుతుంది. అందుకే దేశ ఆర్థిక స్థితిని నిర్ణయించే ప్రధానమైన అంశాల్లో వ్యవసాయమే మొదటిది. మన దేశంలో చాలా భూభాగం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ఇందులో చాలా భూమి వర్షాధారమే. ఆషాడం, శ్రావణ మాసాల్లో మంచి వర్షపాతం ఉంటే రైతులు ఉత్సాహంగా పంటలు పండించగలుగుతారు. మూడొంతుల్లో రెండొంతుల వర్షం సీజన్లో కురిసినా..మిగిలిన ఒక వంతు కార్తీకమాసంలో కురిస్తే చాలు మరో పంట చేతికందే అవకాశం ఉంటుంది. గ్రహాల గమనం ఆధారంగా కూడా వర్షపాతాన్ని అంచనా వేసేవారు..దానిని బట్టి ఏ సమయంలో ఏ పంట వేయాలి, కాలువలు చెరువులకు దగ్గరగా ఎలాంటి పంటలు వేయాలనేది కూడా ముందుగా గ్రహించి దానిప్రకారం రైతులను ప్రోత్సహించాలి. పంట వేయడంతో పాటూ అధిక దిగుబడి సాధించేందుకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి.
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
పశుపోషణ
వ్యవసాయం - పశుపోషణం రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పంట పండించేందుకు పశువులు అవరసం అయితే... ఆ దిగుబడి బావున్నప్పుడే పశు గ్రాసానికి కొరత ఉండదు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందరకీ అందుబాటులో ఉండాలంటే పశుపోషణ సక్రమంగా ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది
వాణిజ్య వ్యవసాయం
గనులు, ఎగుమతులు, దిగుమతులు, స్థానిక మార్కెట్...ఇవన్నీ వాణిజ్య వ్యవసాయం కిందకు వస్తాయి. దీని అభివృద్ధికి ప్రభుత్వం , పాలకుల నుంచి సహకారం చాలా అవసరం అవుతుంది. ఎన్నో లోహాలు తయారేచేసేందుకు అవసరం అయిన ముడి ఖనిజాలన్నీ భారతదేశంలో లభ్యమవుతాయి. ఆ ఖినిజాలు ఉండే భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఆ లోహాలను తీసేందుకు గనులు సొంతంగా నిర్వహించినా, వాటిని లీజుకిచ్చి ప్రభుత్వాదాయం మరింత పెంచినా..ఇదంతా ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. అంటే ఈ ఆదాయం పెరిగినా, తగ్గినా అది పూర్తిగా పాలకుల ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది...
Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!