Chanakya Niti in telugu: అలా జీవించడం, మరణం కంటే బాధాకరం
Chanakya Niti: చాణక్యుడు మరణం కంటే అవమానాన్ని బాధాకరమైనది, హానికరమైనదిగా అభివర్ణించాడు. నిత్యం అవమానాలతో బతకడం కంటే చనిపోవడమే మేలు అని తెలిపాడు.
Chanakya Niti: చాణక్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు, రక్షకుడిగా దూరదృష్టి గల రాజకీయవేత్తగా పేరొందాడు. అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు…జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా మానవ ప్రవర్తనకు సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. ఆయన చెప్పిన నియమాలు, సూక్తులు నేటికీ ప్రభావవంతంగా ఉన్నాయి.
మనిషి జీవితం ఆశ, నిస్పృహల మిశ్రమం అని చాణక్యుడు చెప్పాడు. మానవునికి కాలానుగుణంగా దుఃఖాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు ప్రపంచంలో ఐదు ఉన్నాయి. అవి సంపద, శరీరం, మనస్సు, బుద్ధి, ఆధ్యాత్మికత. మనం ఏ విధానం తీసుకుంటామో అది మన ఇష్టం. సంతోషకరమైన జీవితం విజయానికి కీలకం, కానీ నిరాశ అనే సుడిగుండంలో చిక్కుకుంటే, మనం విజయం సాధించగలమా లేదా అని చింతించడం ప్రారంభిస్తాం, అప్పుడు జీవితం కష్టాల పాలవుతుంది.
చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా మరణం కంటే ఎక్కువ బాధను ఇచ్చే విషయాలను ప్రస్తావించాడు.
వరణ్ ప్రాణాపరిత్యాగో మానభంగాన్ జీవనాథ్
ప్రాణత్యాగే క్షణాన్ దుఃఖ్ మానభంగే దినే దినే
మృత్యు సే భీ కష్టదాయీ హై తిరస్కార్
Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!
మరణం కంటే అవమానం చాలా బాధాకరం
ఆచార్య చాణక్యుడు అవమానం కంటే మరణమే గొప్పదని పేర్కొన్నాడు. మరణం ఒక్క క్షణం మాత్రమే బాధిస్తుందని, అవమానకరమైన జీవితం నిత్యం చంపుతూనే ఉంటుందని వివరించాడు. అవమానం కారణంగా ప్రతి రోజు మనసులో బెంగగా ఉంటుంది. అయితే తమ గౌరవం విషయంలో రాజీపడేవారిని ప్రతిరోజూ అవమానించవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు అవమానాల బాధను అనుభవిస్తూ తమ జీవితాన్ని గడుపుతారని తెలిపాడు. పదేపదే అవమానాలు ఎదుర్కొనే వ్యక్తికి సమాజంలో గౌరవం తగ్గుతుందని, ప్రజలు అతన్ని దూరం పెడుతూ, మాట్లాడేందుకూ ఇష్టపడరని చాణక్యుడు స్పష్టంచేశాడు.
భార్య లేదా స్నేహితురాలు నుంచి విడిపోయే పరిస్థితి వస్తే ఆ వ్యక్తికి చాలా విచారంగా ఉంటుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడం అందరికీ అంత సులభం కాదు. బంధువులు, స్నేహితులు లేదా ఇతరులు అవమానిస్తే ఆ పరిస్థితి చాలా బాధ కలిగిస్తుంది. అలాంటి అవమానం ఆ వ్యక్తిని లోలోపల మంటలా దహించివేస్తుంది. అధికంగా అప్పులను చేసి.. తిరిగి చెల్లించలేనప్పుడు.. మనస్సు కలవరానికి గురవుతుంది. మంచి వ్యక్తి..దయ లేని యజమాని, కపట వ్యక్తికి సేవకుడు అయితే అతను ప్రతి క్షణం బాధ పడుతూనే ఉంటాడు. ఏ మనిషికైనా పేదరికం చాలా బాధాకరం. డబ్బు లేనప్పుడు, ఒక వ్యక్తి తన ఆనందాన్ని పూర్తిగా వదులుకోవాల్సి రావడం తీవ్రంగా బాధిస్తుంది.
Also Read: ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!
అవమానానికి ప్రతీకారం ఇలా తీర్చుకోండి
ఎవరైనా అవమానిస్తే ఒకసారి భరించడం తెలివైన పని అని చాణక్యుడు చెప్పాడు. రెండోసారి అవమానాన్ని తట్టుకోవడం ఆ వ్యక్తి గొప్పతనాన్ని పరిచయం చేస్తుంది, కానీ మూడోసారి కూడా అవమానాన్ని భరించాల్సి వస్తే దాన్ని అతని మూర్ఖత్వంగా చాణక్యుడు పేర్కొన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, మీ ప్రతి దాడికి ప్రత్యర్థి సిద్ధంగా ఉన్నందున అతని భాషలో అతనికి సమాధానం ఇవ్వకూడదని సూచించాడు. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే శత్రువు ముందు చిరునవ్వే నీ పెద్ద ఆయుధం అంటాడు చాణక్యుడు. చిరునవ్వు ద్వారా, మీరు అతన్ని తాకకుండానే తీవ్రంగా గాయపరచవచ్చని తెలిపాడు.