Cancer Horoscope 8th June 2022: జూన్ 8 కర్కాటక రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో కర్కాటక రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
కర్కాటక రాశి అధిపతి- చంద్రుడు
కర్కాటక రాశి వారి పేర్లలో మొదటి అక్షరాలు - హీ, హు, హే, హో, డా, డీ, డు, డే, డు
కర్కాటక రాశివారికి మంచి రోజులు- సోమవారం,మంగళవారం,గురువారం
జూన్ 8 కర్కాటక రాశిఫలితం (Cancer Horoscope 8th June 2022)
కర్కాటక రాశివారికి గడిచిన రోజులకన్నా ఈ రోజు ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. సాయంత్రంలోగా ఓ శుభవార్త వింటారు. ఈ వార్త విన్నాక మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. పనిపట్ల అలసత్వం వద్దు. కొత్తగా తలపెట్టిన పనుల పల్ల ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. విద్యార్థులకు ఈ రోజు శుభసమయం. కొత్త ఆదాయ వనరులు కలిసొస్తాయి.
Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా
కర్కాటక రాశి వార ఫలం ( Cancer Weekly Horoscope June 6 to June 12)
ఈ వారం కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి..కొత్త పనులు మొదలెడతారు. శుభకార్యాలకోసం ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం.విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగలకు విధినిర్వహణలో ఎదురైన అవాంతరాలు తొలగిపోతాయి. పారిశ్రామిక వేత్తలకు శుభసమయం. వారం చివర్లో బంధువులతో తగాదాలుంటాయి.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
కర్కాటక రాశి జూన్ నెల ఫలితం ( Cancer 2022 June Horoscope)
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల కర్కాటక రాశివారికి అన్ని విధాలుగా బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ధనం చేతికందుతుంది. వ్యవహారాలు కలిసొస్తాయి.ఈ రాశికి చెందిన పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో సీనియర్ల అనుభవాలను పరిగణలోకి తీసుకోండి.కష్టపడే తత్వం నుంచి వెనకడుగు వేయవద్దు. నెల ప్రారంభంలో అనవసరమైన ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. పెద్దల ఆశీస్సువు మీపై ఉంటాయి. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుస్తారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.