అన్వేషించండి

Bonalu 2023: బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు

Bonalu 2023: భాగ్య నగరవాసుల ప్రత్యేక పండుగ బోనాలు.ఈ వేడుకను ఆషాడంలోనే ఎందుకు నిర్వహిస్తారు, దీనివెనుకున్న ప్రత్యేక కారణాలేంటో తెలుసుకుందాం.

Bonalu 2023: డప్పు చప్పుళ్లు,శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. ఇంతకీ ఆషాడంలోనే బోనాలు ఎందుకు జరుపుతారు.

అమ్మకు నైవేద్యం బోనం

బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. సంప్రదాయానికి చిహ్నమైన ఈ బోనాన్ని స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ..గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. 

Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!

ఆషాడంలోనే ఎందుకు

ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.  బోనాలు తీసుకెళుతున్న మహిళలపై అమ్మవారు ఉంటుందని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదాలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. ఆషాడమాసం వర్షాలు విరివిగా కురవడంతో క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం  కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. దానినే గత్తర వచ్చింది అనేవారు.ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. ఆ ఆరాధనకు ఉపయోగించే వస్తువులన్నీ వైరస్ ను నిర్మూలించేవే.  వేపాకులు, పసుపునీళ్లు ఇవన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి. 

పోతురాజు

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజు ముందునడుస్తుండగా అమ్మకు బోనం సమర్పిస్తారు. ఒంటిపై పసుపు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.  భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు. ఈ పుజాకార్యక్రమాలకు ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా పోతురాజుని భావిస్తారు.

Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!

జూన్ 22 నుంచి జులై 17 వరకూ బోనాలు

కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజదానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి.  గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. భాగ్యనగరంలో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలో మొదలై లష్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయంలో మొదలైన ఘటాల ఊరేగింపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగి  నయాపుల్ వద్ద ఘటాల నిమజ్జనంతో ముగుస్తుంది. 
ఈ ఏడాది బోనాలు జూన్ 22న అంటే ఆషాడంలో వచ్చే మొదటి గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటూ ప్రతి గురువారం , ఆదివారం అమ్మవారికి బోనం సమర్పిస్తారు. జులై 9 ఆదివారం మహంకాళి బోనాలు, జులై 10 సోమవారం రంగం, జూలై 16న లాల్ దర్వాజ బోనాలు, జులై 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజుతో బోనాలు ముగుస్తాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget