ABP Desam


2023 జూన్ 25 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
మృదు స్వభావం తో మెలగండి. మాటల విషయంలో సంయమనం పాటించండి. శారీరక మానసిక రుగ్మతలతో కొంచెం ఇబ్బంది పడతారు. శ్రమ కి తగిన ఫలితం దక్కదు.అయినా నిరాశ చెందకుండా ముందుకు సాగండి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది.


ABP Desam


వృషభ రాశి
ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. తండ్రి తరపున కానీ , పూర్వీకుల తరపున కానీ వచ్చిన ఆస్తితో ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వంతో ఆర్థిక వ్యవహారాలు లాభం చేకూరుస్తాయి. విద్యార్థులు తమ చదువుల్లో బాగా రాణించగలుగుతారు.


ABP Desam


మిథున రాశి
కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులుకు అధికారులు నుంచి కానీ , ప్రభుత్వం నుంచి కానీ మంచి ఫలితాలు పొందుతారు., తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.


ABP Desam


కర్కాటక రాశి
అపార్థాలు , ప్రతికూల ప్రవర్తన, మీ మనస్సులో అపరాధ భావనను సృష్టిస్తుంది. ముఖ్యంగా నేత్ర సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. పని విషయంలో సంతృప్తి కలుగుతుంది. ధనం ఖర్చు అవుతుంది.


ABP Desam


సింహ రాశి
ఈరోజు మీరు ఏ పని విషయంలోనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తండ్రి, పెద్దల మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ స్వభావంలో కోపం, మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఉదర సంబంధిత ఇబ్బందులు ఉంటాయి.


ABP Desam


కన్యా రాశి
ఈరోజు మీ అహంకారం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది. శారీరక , మానసిక ఆందోళనతో గడుపుతారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వలన మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబ సబ్యులతోనూ, స్నేహితులతో విభేదాలు ఉంటాయి.


ABP Desam


తులా రాశి
ఈరోజు శుభప్రదమైన రోజు. అన్నిటా ప్రయోజనకరమైన రోజు. స్నేహితులతో సమావేశాల్లో కానీ విహార యాత్ర లో కానీ అందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆనందం, సంతృప్తి ఉంటుంది.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు మీరు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ నిపుణులకు పురోగతి మార్గం స్టాట్ అవుతుంది.


ABP Desam


ధనుస్సు రాశి
ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనిలో ఉత్సాహం లోపిస్తుంది. మనసు ఆందోళనలోనే ఉండిపోతుంది. పిల్లల సమస్య దీనికి కారణం కావచ్చు. వ్యాపారం, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది.


ABP Desam


మకర రాశి
ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు పోనీయవు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. భాగస్వాములతో సంబంధాలు చెడతాయి. వలస వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.


ABP Desam


కుంభ రాశి
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయం పెరగవచ్చు. విహార యాత్ర నిర్వహిస్తారు. ప్రజా జీవితంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు.


ABP Desam


మీన రాశి
ఈ రోజు ఆత్మవిశ్వాసం మీ పనిని విజయవంతం చేస్తుంది. కుటుంబంలో సంతోషం, శాంతి, వాతావరణం ఉంటుంది. కోపం కారణంగా మీ మాటలు, ప్రవర్తన దూకుడుగా మారకుండా జాగ్రత్త వహించండి. మీరు ఉద్యోగంలో ఆధిపత్యం చెలాయిస్తారు.