మేష రాశి ఈ రాశివారు వ్యక్తిగత విజయాలు సాధిస్తారు. ఈరోజు అన్ని రంగాల్లో క్రియాశీలతను కొనసాగించనున్నారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పనులను పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. ఈరోజు కొన్ని పెద్ద సమస్యలు దూరమవుతాయి.
వృషభ రాశి ఈ రాశివారు సన్నిహిత సంబంధాలలో శ్రద్ద వహించండి. చురుకుగా ఉండేందుకు ట్రై చేయండి. సున్నితమైన విషయాల్లో తొందరపాటు వద్దు. అహంకారం, మొండితనం మానుకోండి. భావోద్వేగ విషయాలలో సహనం పెంచుకోండి. వృత్తి వ్యాపారాలలో వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు.
మిథున రాశి ఈరోజు ధైర్యంగా ముందడుగు వేస్తారు. సోదరులతో సన్నిహితంగా మెలుగుతారు. కొత్త వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్నేహపూర్వకంగా సున్నితంగా ఉంటారు. అందరి పట్ల గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో మరపురాని క్షణాలను పంచుకుంటారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ద పెరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వస్త్రధారణపై శ్రద్ద, అవగాహన పెరుగుతుంది .
సింహ రాశి ఈ రోజు శుభ కార్యాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరినీ గౌరవిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వినయంతో, విచక్షణతో, సున్నితత్వంతో వ్యవహరిస్తారు.
కన్యా రాశి దూర ప్రాంతాలకి వెళ్లి ఏదైనా కార్యక్రమం పూర్తి చేయాల్సి వస్తే ఓర్పు సహనం అవసరం. అనవసర ఖర్చుల నియంత్రణను కొనసాగించండి. న్యాయపరమైన విషయాల్లో సహనం , వినయాన్ని పెంచుకోండి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. మీరున్న స్థానంలో గౌరవం దక్కుతుంది.
తులా రాశి ఈ రోజు వృత్తి వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ముఖ్యమైన అంశాల్లో వేగం పెంచుతారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకున్న దానికంటే మెరుగ్గా పని చేస్తారు. వృత్తి నైపుణ్యంపై పట్టుదలతో ముందుకుసాగుతారు. వ్యాపార పురోగతి వలన ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తుంది. బడ్జెట్‌పై దృష్టి సారిస్తారు.
ధనుస్సు రాశి అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు చాలా విషయాలు పరిష్కారమవుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. పెద్దల నుంచి సహకారం అందుతుంది. వ్యక్తిగత ప్రయత్నాలను వేగవంతంచేస్తారు. కొత్త రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. వ్యాపారం ఊపందుకుంటుంది.
మకర రాశి మాట, ప్రవర్తనలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారు. సమతుల్యతతో, సామరస్యంతో ముందుకు సాగుతారు. పనిలో సహనం ప్రదర్శిస్తారు. అవసరమైన పనుల జాబితాను రూపొందించండి.
కుంభ రాశి ఈరోజు ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపార ప్రణాళికలకు రూపాన్ని ఇస్తారు. లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. చర్చలలో సౌకర్యవంతంగా పాల్గొంటారు. నాయకత్వ సామర్థ్యం బలపడుతుంది. భవన నిర్మాణ పనుల్లో చురుకుదనం ఉంటుంది.
మీన రాశి వృత్తిపరంగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కఠోర శ్రమతో మీరెంచుకున్న రంగంలో స్థానం సంపాదించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. హేతుబద్ధంగా పని చేస్తారు.