కుజుడి సంచారం 45 రోజుల వరకూ ఈ రాశులవారికి తిరుగులేదు



జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి, వివాహానికి కారకుడు. జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే దేనికీ లోటుండదు.



అశుభ స్థానంలో ఉంటేమాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు కుజుడు. ఇది కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తుంది.



మేష రాశివారు కుజుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ రాశినుంచి నాలుగో స్థానంలో కుజుడి సంచారం జరుగుతోంది. ఈ ఫలితంగా నచ్చిన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారు.తలపెట్టిన పనిలో కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.



వృషభ రాశి వారు అంగారకుడి సంచారం వల్ల లాభపడతారు. సింహరాశిలో ఈ కుజుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశిలో, కుజుడు జాతకంలో నాల్గవ ఇంట ఉన్నాడు. నూతన వాహనానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబంతో సరదాగా ఆనందంగా గడుపుతారు



సింహ రాశి వారికి కుజుడి సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో కుజుడు నాలుగు , తొమ్మిది స్థానాలకి అధిపతి. ఈ కారణంగా మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీరు ఏ పనినైనా భాద్యతగా, సులభంగా పూర్తి చేయగలుగుతారు. నాల్గవ ఇంట కుజుడు ఉండటం వల్ల అదృష్టం మీ వెంట ఉంటుంది,



ధనుస్సు రాశి వారికి కుజ సంచారం శుభప్రదం కానుంది. కుజుడు ధనుస్సు రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితంగా వృత్తి వ్యాపారాలకు అనుకూలం. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసొస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్న తీరని కోరికలు నెరవేరుతాయి.



సింహ రాశిలో కుజుడి సంచారం వృశ్చిక రాశివారికి లాభాన్నిస్తుంది. అనుకోని ధనం చేతికందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబంలో, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు



Image Credit: Pixbay


Thanks for Reading. UP NEXT

2023 జూన్ 19 రాశిఫలాలు

View next story