2023 జూన్ 18 రాశిఫలాలు



మేష రాశి
మీ ఆరోగ్యం బాగుంటుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఈరోజు కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది.



వృషభ రాశి
మీకు ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు ఆనందంగా గడుపుతారు.స్నేహితుల నుంచి బహుమతులు పొందుతారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. మెరుగైన సంపాదన ఉంటుంది. కార్యాలయంలో వివాదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి.



మిథున రాశి
ఈరోజు సంయమనం పాటించండి. స్నేహితునితో మనస్పర్థలు ఏర్పడవచ్చు.కొన్ని కారణాల వల్ల అపార్థం ఏర్పడవచ్చు. అనారోగ్య సూచన. ఇంటి వాతావరణంలో ఏదోతెలియని ఆందోళన ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



కర్కాటక రాశి
ఈ రోజు ఆర్ధిక లాభదాయకం ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఆర్ధిక, వ్యాపార లావాదేవీలు చేయగలుగుతారు. పిల్లలతో కలిసి షికారు వెళ్తారు.



సింహ రాశి
ఈరోజు పనుల్లో జాప్యం ఉంటుంది. మీ ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. జీవితం కాస్త క్లిష్టంగా కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. వ్యాపారులు చాలా లాభాలను పొందుతారు . బంధువులతో లావాదేవీలు చేయకండి.ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోకండి.



కన్యా రాశి
ఈరోజు మానసికంగా అలసటను అనుభవిస్తారు. పిల్లల ఏదైనా పొరపాటు వల్ల ఒత్తిడికి గురవుతారు. కోర్టు కేసులో ఇరుక్కోవచ్చు. పై అధికారితో వివాదాలు కూడా రావచ్చు. కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మతపరమైన పనుల్లో ఖర్చు చేస్తారు.



తులా రాశి
ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మాటల్లో సంయమనం పాటించాలి లేకపోతె తీవ్ర నష్టం జరుగుతుంది. వివాదాలు, విభేదాలు ఉండవచ్చు. మీ దుడుకు స్వభావాన్ని నియంత్రించండి. ఖర్చులను నియంత్రించండి.



వృశ్చిక రాశి
ఈ రోజు ఆనందం, వినోదంతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్త్రీలకు నూతన వస్త్రాలు, ఆభరణాలు లభిస్తాయి. కొత్త పనిని ఆనందిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని పనుల్లో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది.



ధనుస్సు రాశి
ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఆనందం, శాంతి, వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో లాభాలు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. స్నేహితుల సహకారం పొందగలుగుతారు. మీరు పరీక్షలో విజయంసాధించి కీర్తిని పొందుతారు.ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.



మకర రాశి
ఈరోజు మానసికంగా గందరగోళానికి గురవుతారు. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈరోజు ముఖ్యమైన పనుల్లో తొందరపడకండి.అదృష్టం మీకు సహకరించకపోవటం తో చిరాకు వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.



కుంభ రాశి
అశాంతిని అనుభవిస్తారు. పెట్టుబడికి మంచి సమయం. విలాస సాధనాలు కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. తండ్రి నుండిప్రయోజనం పొందుతారు. భూమి, ఇల్లు, వాహనం మొదలైన వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.



మీన రాశి
అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సృజనాత్మకత , కళాత్మకత అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు వలసలు లేదా పర్యాటకానికి అనుకూలం. నిరుద్యోగులకు ప్రయోజనం పొందబోతున్నారు.