ABP Desam


జూన్ 15 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది.కుటుంబ సభ్యులు, సన్నిహితులతోప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అత్యుత్సాహం తో నష్టాలు తెచ్చుకోకండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.


ABP Desam


వృషభ రాశి
ఈరోజు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కావున సంయమనం పాటించి వివాదాయాలకు దూరంగా ఉండండి. అనారోగ్య కారణాల వల్ల మీరు నిరాశకు లోనవుతారు. కుటుంబంలో విభేదాలు కారణంగా మీరు అపరాధ భావంతో ఉంటారు.


ABP Desam


మిథున రాశి
ఈరోజు వ్యాపార రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. స్నేహితుల వలన ప్రయోజనంపొందుతారు. డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అందమైన ప్రదేశాల పర్యటనకు వెళ్తారు. రోజంతా ఆనందంగా ఉంటుంది.


ABP Desam


కర్కాటక రాశి
కుటుంబ సభ్యులపై ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది.


ABP Desam


సింహ రాశి
ఈరోజు మీ మనసుకు స్వాంతన ఉండదు. ఎదుటివారి అసంతృప్తిని భరించవలసి వస్తుంది. కుటుంబ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ,వ్యాపారస్తులకు సకాలం లో పనులు నెరవేరవు.


ABP Desam


కన్యా రాశి
ఈరోజు ఓర్పు సహనం అవసరం. కోపం వల్ల నష్టంవాటిల్లి మీ ప్రవర్తనకు మీరు పశ్చాత్తాపపడవచ్చు. ఈరోజు దంపతుల మధ్య గొడవలు. పొంచి ఉన్న శత్రువులతో ముప్పు..మీరు అప్రమత్తంగా ఉండండి. ఈరోజు కొత్త పనులను ఇంకొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది.


ABP Desam


తులా రాశి
ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఏదో పని మీద బయటకు వెళతారు. స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రియమైన వ్యక్తితో సాన్నిహిత్యం మీకు ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంట బయటా గౌరవాన్ని పొందుతారు.


ABP Desam


వృశ్చిక రాశి
ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. శత్రువులు ఎన్ని కుట్రలు చేసిన ఫలించవు. మాతృవర్గం నుంచి ప్రయోజనాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు ఆరోగ్య విషయం లో ఆందోళన ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవటం వలన నిరాశకు గురవుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కళ, సాహిత్యంపై ఆసక్తి కలుగుతుంది.


ABP Desam


మకర రాశి
మీ రోజు కష్టాలతో సాగుతుంది. మనసు కలత చెందుతుంది. శరీరంలో ఓపిక, శక్తి లోపిస్తాయి . వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల వ్యవహారాల్లో స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు.


ABP Desam


కుంభ రాశి
ఈరోజు, ఆందోళన తొలగిపోవడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుని సంతోషిస్తారు. దంపతులు రోజంతా ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ సమస్యలు పెరగవచ్చు.


ABP Desam


మీన రాశి
ఈరోజు వివాదాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులను కూడా నియంత్రించుకోండి. డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆహారం,పానీయాలలో సంయమనం పాటించండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకొండి .