జూన్ 14 రాశిఫలాలు



మేష రాశి
ఈరోజు మీ మాటల విషయంలో సంయమనం పాటించండి. ఏదైనా విషయంలో వాగ్వాదం జరగొచ్చు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కొంత గందరగోళంలో గడిచిపోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మధ్యాహ్నం తర్వాత సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.



వృషభ రాశి
ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి. శారీరక ,మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు.



మిథున రాశి
మీకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ, వృత్తిపరమైన రంగాలలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాద వాతావరణం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఆరోగ్యంనిలకడగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ రోజు మీరు మనసుకి నచ్చిన పనిని ప్రారంభిస్తారు, కొత్తగా ఏమైనా చేయాలన్న ఆసక్తి కలుగుతుంది. సాహిత్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించగలరు. తీర్ధ యాత్రలకు ప్రణాళిక వేస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.



సింహ రాశి
ఈరోజు నూతన కార్య క్రమాలకు శ్రీకారం చుడతారు. తండ్రి నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు జ్యోతిష్యం, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. అనవసర ప్రసంగాలు వద్దు, మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకుంటే మంచి జరుగుతుంది.



కన్యా రాశి
ఈ రోజు ప్రారంభమే విందు వినోదం తో మొదలవుతుంది.భాగస్వామ్య పనులలో జాగ్రత్త వహించండి. వ్యాపారంలో ఆశించినంత లాభం ఉండదు. మీరు మధ్యాహ్నం తర్వాత ప్రతికూలవాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరంగా బలహీనంగా ఉంటారు.



తులా రాశి
ఈరోజు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని సులభంగా చేయగలుగుతారు. కుటుంబం లో ఆనందం, శాంతి ఉంటుంది. శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ మాటపై సంయమనం పాటించండి. మధ్యాహ్నం తర్వాత మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.



వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. ఏ విషయంలోఅయినా అజాగ్రత్తగా ఉండకండి. విద్యార్థులు ఈరోజు విజయం సాధించగలరు. మీ ఊహతో సాహిత్య సృజనలో కొత్తదనం తీసుకురాగలరు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి.



ధనుస్సు రాశి
కుటుంబంలో కలహాలు, వీటిని సరిచేయాలనుకుంటే అనవసర వాదనలకు గాని చర్చలకు గాని దూరంగా ఉండండి. తల్లి ఆరోగ్యం క్షిణిస్తుంది. డబ్బు, పేరు ప్రతిష్టలకు నష్టం వాటిల్లుతుంది. మీ స్వభావంలో భావోద్వేగం పెరుగుతుంది.



మకర రాశి
ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలరు. ప్రియమైన స్నేహితులతో, సమావేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.సోదరులతో సాన్నిహిత్యం ఉంటుంది. మీ మనస్సు స్థిరంగా ఉండదు. శారీరకంగా అలసటకు గురి అవుతారు.



కుంభ రాశి
ఈరోజు మీరు మాటల్లో సంయమనం పాటించండి. ప్రతికూల ఆలోచనలు మీ మనసుకు బాధ కలిగించవచ్చు. ఆహారం, పానీయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఆలోచనల స్థిరత్వంతో అన్ని పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు.



మీన రాశి
ఈరోజు ఇంట్లో ఆద్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త పనులకు అనుకూలమైన రోజు. కోపం ఎక్కువగా ఉంటుంది.