శని తిరోగమనంతో ఈ రాశులవారికి ఇబ్బందులు తప్పవు



నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని యోగకారకుడిగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో యోగకారకుడు కాకపోతే ఊహించనన్ని కష్టాలు వెంటాడుతాయి.



గోచారరీత్యా శని 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతి ఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.



శని ఒక్కో రాశిలో రెండున్నరేళ్ల చొప్పున సంచరిస్తాడు. నిన్నటి వరకూ కుంభంలో సంచరించిన శని ఇప్పుడు కూడా అదే రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు.



నవంబరు వరకూ తిరోగమనంలోనే ఉంటాడు. కర్మదాతగా పిలిచే శని..ఆయా వ్యక్తి కర్మల ప్రకారం మంచి చెడు ఫలితాలిస్తాడు.



ఈ నాలుగైదు నెలల పాటూ కుంభంలో శని తిరోగమనం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు పెరుగుతాయి.



కర్కాటక రాశి
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. శని తిరోగమనం కారణంగా, మీ ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించవచ్చు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో గందరగోళం కారణంగా మీపై ఒత్తిడి కూడా పెరుగుతుంది.



సింహ రాశి
సింహ రాశి వారికి శని తిరోగమనం వల్ల నిరాశతప్పదు. మీ మనస్సు ఉద్యోగంలో నిమగ్నమై ఉండదు, దాని కారణంగా సమస్యలు పెరుగుతాయి. మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ టైమ్ లో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా నష్టాన్ని చవిచూడాల్సి రావొచ్చు.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు వచ్చే 6 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని తిరోగమన స్థితి మీకు మంచిది కాదు. కుటుంబ విషయాలతో పాటు, మీరు వృత్తి మరియు ఆర్థిక విషయాలలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. వ్యాపారంలో నష్టపోతారు.



మీన రాశి
శని తిరోగమనం వల్ల మీనరాశివారికి మానసిక, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ ప్రవర్తనలో హుందాతనం ఉండదు. కుటుంబ జీవితంతో పాటూ కార్యాలయంలోనూ సమస్యలు తప్పవు. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు, సమన్వయ లోపం వల్ల ఇంటి వాతావరణం చెడుతుంది. మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Images Credit: Pinterest