జూన్ 16 రాశిఫలాలు



మేష రాశి
ఈరోజు ఉత్సాహంగా రోజుని ప్రారంభిస్తారు. స్నేహితులు, బంధువుల రాక వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. బహుమతులు అందుకుని సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.



వృషభ రాశి
కోపం , చిరాకు వలన పనులకు ఆటంకం. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబ సమస్యల వలన ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రసంగం వలన ఎడిటివారితో వైరం ఏర్పడుతుంది. వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కష్టపడినా ఫలితం దక్కదు.



మిథున రాశి
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అవివాహిత లకు వివాహ సూచనలు.ధన లాభం ఉంటుంది.మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.



కర్కాటక రాశి
కుటుంబ పనుల్లో ఈరోజుబిజీ బిజీ గా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో లబ్ధి పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది.



సింహ రాశి
ఈరోజు ఏ పని చేయాలనే ఆలోచన కలగదు, మందకొడిగా ఉంటుంది. ఇతరుల మీ పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. కొన్ని పనిలో పొరపాట్లు వలన వివాదాలు రావచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగంలో సమస్య ఉంటుంది.



కన్యా రాశి
ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. అవగాహన లోపం వల్ల నష్టం జరగవచ్చు. కుటుంబం, స్నేహితులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. వ్యాపారంలో భాగస్వామ్య పనులలో జాగ్రత్త వహించండి. ఈరోజు ప్రయాణం వాయిదా వేసుకుంటే మీకేమంచిది.



తులా రాశి
ఈరోజు మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రజాభిమానం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఏకాంతంలో ఉండటానికే ఇష్టపడతారు. సంతోషకరమైన వార్తలు వింటారు.



వృశ్చిక రాశి
ఈరోజు మీ ఆందోళనలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. మానసిక ఆనందం పొందుతారు. ఉత్సాహం ఉంటుంది. కార్యాలయంలో మరింత బాధ్యతగా వ్యవహరించ వలసి ఉంటుంది, మీబాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరగవచ్చు.



ధనుస్సు రాశి
ఈ రోజు ఆస్తి వివాదాల చుట్టిముట్టడం వలన ఆందోళన చెందుతారు. ఆరోగ్యం గురించి చింతతో మానసికంగా బలహీనంగా ఉంటారు. ఉదర సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పనిలో వైఫల్యం కారణంగా మీలో నిరాశ ఆవహిస్తుంది. వ్యాపారంలో నష్టం రావచ్చు.



మకర రాశి
సోమరితనం అధికంగా ఉంటుంది. ఏదో తెలియని భయం వలన ఆందోళన చెందుతారు. టైం తప్పిన ఆహారం, నిద్ర, ఉంటుంది. స్నేహితుల వల్ల నష్టం కానీ వారితో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జించగలరు.



కుంభ రాశి
ఈరోజు మీకు చాలా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీలో ఉత్సాహం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనికిరాని చర్చల్లో సమయాన్ని వృథా చేయకండి. శౌర్యం పెరుగుతుంది, జీవిత భాగస్వామితో సాన్నిహిత్య ఆహ్లాదంగా ఉంటుంది.



మీన రాశి
ఈరోజు శుభదినం. ఆఫీసు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. ఇష్టమైన ఆహారం ఆస్వాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.