జూన్ 17 రాశిఫలాలు



మేష రాశి
ఈరోజు మీరు పని విషయంలో చలాకీగా ఉండరు అందుకే పనులు మంద కోడిగా సాగుతాయి. ఎవరితోను అనవసర వాదనలు చేయకండి. మీ మాటలపై నియంత్రణ లేకపోవడం సమస్యగా ఉంటుంది. చర్చలకు గొడవలకు దూరంగా ఉండండి.



వృషభ రాశి
ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. బట్టలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు , వినోదం కోసం ధనాన్ని వెచ్చిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.



మిథున రాశి
ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదం జరగవచ్చు. టెన్షన్ కు లోనవుతారు . బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు, ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి.



కర్కాటక రాశి
వ్యాపారానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచిది. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఆదాయ వనరుల పెరుగుదలతో సంతోషంగా ఉంటారు. ఆత్మ సంతృప్తి ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్త అందుకుంటారు.



సింహ రాశి
ఉద్యోగస్తులకు లాభం ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత శుభకరం. మీరు మీ కార్యాలయంలో ఆధిపత్యాన్ని పొంది ఇతరులను ప్రభావితం చేస్తారు. మీ విశ్వాసం, దృఢమైన సంకల్పం వలన పనులు సులభంగా పూర్తి చేస్తారు. పెద్దమనుషులను కలుస్తారు. పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.



కన్యా రాశి
ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తారు. ఆకస్మిక తీర్థయాత్రలు ఉంటాయి. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగకండి.



తులా రాశి
ఈ రోజు మీరు అకస్మాత్తుగా ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. ఆధ్యాత్మిక విజయాల కోసం ప్రయత్నిస్తారు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రహస్య శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ విజయం సాధించలేరు.



వృశ్చిక రాశి
ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఏదో పని మీద బయటకు వెళ్ళవచ్చు. విదేశీ ప్రయాణాలు ప్లానింగ్ కి అనుకూలం. మీరు తలపెట్టిన పనులకు స్నేహితులు ,కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.



ధనుస్సు రాశి
ఈరోజు శుభదినం. పనులు సులభంగా పూర్తిచేస్తారు. దాన, ధర్మాలలో పాల్గొంటారు. ఈ రోజు మొత్తం సరదాగా గడుపుతారు. గౌరవం లభిస్తుంది. గృహ జీవితంలో ఆనందం ఉంటుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. సామాజిక వ్యక్తులతో అర్థవంతమైన చర్చ ఉంటుంది.



మకర రాశి
ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉండండి. కుల వృత్తులపట్ల ఆసక్తి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం. శారీరక అలసట ఉంటుంది. కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు.



కుంభ రాశి
కోపం ఎక్కువుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మాటతీరులో సంయమనం లేకపోవడం వల్ల కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. దగ్గరి బంధువుల వల్ల విబేధాలు, కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరించదు. ప్రమాదాన్ని నివారించండి.



మీన రాశి
ఈ రోజు అత్యంత శుభకరం. వ్యాపారంలో భాగస్వామ్య పెట్టుబడులకు ఇది ఉత్తమ సమయం. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు. స్నేహితులతో అనుబంధం మరింతగా బలపడుతుంది. ప్రజా జీవితంలో పురోగతి ఉంటుంది.