2023 జూన్ 22 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వివాహ సంబంధాలపై దృష్టి సారిస్తారు. వాదనలు వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రవర్తనలో మార్పు ఉంటుంది ఏ విషయాన్నికూడా సీరియస్ గా తీసుకోరు.



వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు అవసరమైన సమాచారం అందుతుంది. సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తారు. స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఔన్నత్యాన్ని పెంచుకుంటారు.



మిథున రాశి
కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందకండి. మీ ప్రసంగంతో అందర్ని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొత్త సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది.



కర్కాటక రాశి
మీరు సృజనాత్మకత వైపు అడుగులేస్తారు. మోడరన్ విషయాలపట్ల ,కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీపై మీరు ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. ప్రియమైనవారితో సంతోషంగా ఉంటారు. ధైర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు.



సింహ రాశి
ముఖ్యమైన సమాచారం అందుతుంది. న్యాయపరమైన విషయాల్లో సహనం ప్రదర్శిస్తారు. సుదూర దేశానికి వెళ్లే అవకాశం ఉంది. అందరి గౌరవాన్ని నిలబెడతారు. స్మార్ట్ వర్క్ పెరుగుతుంది. అప్పుల బారినుంచి తప్పించుకుంటారు. సంబంధాలు మెరుగుపడతాయి.



కన్యా రాశి
వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో చురుకుదనం ప్రదర్శిస్తారు. అన్నిటా విజయం సాధిస్తారు. వ్యాపార ప్రణాళికలు అభివృద్ధి చెందుతాయి. అధికారులతో సమావేశం కానున్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.



తులారాశి
పాలనా వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారంలో నమ్మకంగా పని చేస్తారు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు.నూతన ఆర్థిక వనరులు ఏర్పడతాయి. ముఖ్యమైన ప్రతిపాదనలు అందుతాయి. పోటీలకి ప్రాధాన్యత ఇస్తారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. ప్రణాళికల్లో వేగం పెంచుతారు. సమావేశాల్లో చర్చలలో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వృత్తి నిపుణులు మెరుగ్గా రాణిస్తారు.



ధనుస్సు రాశి
క్రమశిక్షణ పెంచుకోండి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సహనం పాటించండి. నిజాయితీకి ప్రాధాన్యత ఇస్తారు. అపరిచితుల నుంచి దూరం పాటిస్తారు. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. పెద్దల సహవాసం కోసం ఆరాట పడతారు.



మకర రాశి
పార్టనర్‌షిప్‌తో పని చేయడం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. పారిశ్రామిక ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. సంపదలో వృద్ధి ఉంటుంది. కొన్ని సమస్యాత్మక సంబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. లక్ష్యాలపై దృష్టి పెడతారు.స్నేహ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది.



కుంభ రాశి
ప్రతిపక్షాలు, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ముందుకు సాగండి. లావాదేవీల్లో స్పష్టత పెరుగుతుంది. రుణ లావాదేవీలకు దూరంగా ఉండండి. చేసే పనిలో వేగం ఉంటుంది. పనిలో దురాశకు, ప్రలోభాలకు లొంగకండి. పాలసీ రూల్స్‌లో అప్రమత్తంగా ఉండాలి.



మీన రాశి
ఈ రాశివారు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. కెరీర్లో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు. పెద్దల పట్ల విధేయత చూపుతారు. పని వేగంపెరుగుతుంది. ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీ వలన అందరూ ప్రభావితం అవుతారు. వ్యక్తిగత విషయాల్లో బాగా రాణిస్తారు.