జూన్ 26 నుంచి జులై 2 వారఫలాలు



మేష రాశి
ఈ వారం మీ బంధాలు బలంగా ఉంటుంది. పాత గొడవలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉండేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. విద్యార్థులు మంచి మార్కులతో చదువులో పురోగతి సాధిస్తారు.



వృషభ రాశి
జీవిత భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు వారికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అహంకారాన్ని వదిలేయండి. ఆఫీసు పనులకు సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది.



మిథున రాశి
ఈ వారం ఈ రాశివారికి ప్రేమ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.వృత్తిని వేగవంతం చేయడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతిభ వల్ల ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది,ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి.



కర్కాటక రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామితో బలమైన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. వృత్తి పరంగా చేసే పనులు విజయవంతమవుతాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరిశోధనా రంగంలో విజయం సాధిస్తారు.



సింహ రాశి
ప్రేమ సంబంధాలలో ఈ వారం మీకు ప్రత్యేకమైనది కాదు. కెరీర్ లో విజయం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. హార్డ్ వర్క్ తగ్గనివ్వకండి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందడానికి ప్రయత్నిస్తారు.



కన్యా రాశి
భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి రానివ్వకండి. చెడు విషయాలను పరిష్కరించడానికి తెలివిగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. మీరు వృత్తి రంగంలో కష్టపడవలసి ఉంటుంది. మీరు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధిస్తారు.



తులా రాశి
ప్రేమ సంబంధాలలో ఈ వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తిలో స్థిరత్వం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న కోర్సును పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ సమయం ఇది.



వృశ్చిక రాశి
ఈ వారం ఈ రాశివారి ప్రేమ సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. మీ వృత్తిలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు కానీ కష్టపడి పనిచేయాలి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



ధనుస్సు రాశి
ప్రేమ సంబంధాల్లో అవగాహన లోపం రానివ్వకండి. మూడో వ్యక్తి మాటల వల్ల గందరగోళం, టెన్షన్ ఏర్పడతాయి. వృత్తి రంగంలో స్థిరత్వం కోసం ఇబ్బందులు ఉండవచ్చు.కానీ మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు.



మకర రాశి
ప్రేమ సంబంధాలలో ఈ వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తిలో సమస్యలు ఎదురవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఎదురైన ఇబ్బందులను తొలగించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.



కుంభం రాశి
ప్రేమ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు వృత్తి రంగంలో కొత్త అవకాశాలను పొందుతారు మరియు పురోగతికి కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకు విజయవంతంగా ఉంటుంది. ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి.



మీన రాశి
ప్రేమ సంబంధాలలో ఈ వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది, జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ కెరీర్ ను సీరియస్ గా తీసుకోండి లేకపోతే సమస్యలు రావొచ్చు. పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.