Pooja Room Vastu: పూజగదిలో ఈ వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట!
Pooja Room Vastu: వాస్తు ప్రకారం పూజగదిలో కొన్ని వస్తువులను ఉంచకూడదట. అలాంటి వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. మరి .. ఆ వస్తువులేంటో తెలుసుకుందామా?
![Pooja Room Vastu: పూజగదిలో ఈ వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట! According to Vaastu these items should not be kept in the pooja hall Pooja Room Vastu: పూజగదిలో ఈ వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/13/5f4598d1df93f845b2e623fc52fdb53d1720816048619239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pooja Room Vastu: దేవుడిని ప్రార్థించేందుకు దాదాపు ప్రతీ ఇంట్లో పూజగది ఉంటుంది. తమ ఇష్టదైవాన్ని పూజగదిలో ప్రతిష్టించి, భక్తిశ్రద్ధలతో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే పూజగదిలో సరైన వాస్తు నియామాలు పాటిస్తేనే.. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సిరిసంపదలు కలుగుతాయి. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే కొన్ని వస్తువులను పూజ గదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదట. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఆ వస్తువులేంటో తెలుసుకుందామా?
పూజగదిలో ఎప్పుడూ ఉంచకూడదని 6 వస్తువులు ఇవే:
విరిగిన విగ్రహాలు:
పూజ గదిలో దేవుళ్ల చిత్రాలు, విగ్రహాలు పూజకు కేంద్ర బిందువుగా ఉంటాయి. కాబట్టి మీరు వాటిని క్రమం తప్పకుండా చూస్తుండాలి. విరిగిన లేదా పగిలిన విగ్రహాలు చెడు శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి విరిగిన విగ్రహాలను తీసివేసి.. వాటి స్థానంలో కొత్త ఫొటోలు కానీ విగ్రహాలు కానీ పెట్టడం మర్చిపోవద్దు.
తోలు వస్తువులు:
తోలుతో చేసిన వాలెట్లు, బెల్టులు, పర్సులకు మీ పూజ గదిలో ఉంచకూడదు. వాస్తు ప్రకారం, తోలుకు తామసిక్ (ప్రతికూల) శక్తి ఉంటుంది. ఇది పూజగది పవిత్రతకు కళంకం కలిగిస్తుంది. తోలుకు బదులుగా చెక్క, పత్తి లేదా పట్టు వంటి సహజ వస్తువులను ఎంచుకోండి.
గడియారం :
సమయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పూజా ప్రదేశంలో గడియారాలు ఉండటం వల్ల మీ ప్రార్థనలు, ధ్యానం నుంచి మీ దృష్టి మరలుతుంది. గడియారం నుంచి వచ్చే శబ్దం ఆధ్యాత్మిక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.
పాదరక్షలు:
మీరు మీ పూజ గదికి దగ్గర పాదరక్షలను ఉంచకూడదు. చెప్పులు, బూట్లు బాహ్య ప్రపంచం నుంచి చెత్తను, ప్రతికూల శక్తులను తీసుకువస్తాయి. కాబట్టి పూజ మందిరానికి చెప్పులు, బూట్లు అనేవి దగ్గరగా ఉంచరాదు.
డస్ట్‌బిన్‌లు:
డస్ట్‌బిన్‌లు సూచించే చెత్త, ధూళి పూజ గది స్వచ్ఛతకు భంగం కలిగిస్తాయి.ఈ ప్రదేశంలో స్వచ్ఛత, సానుకూల శక్తి ప్రవహించేలా ఉంచడానికి, వాటిని అక్కడ ఉంచకూడదు. బదులుగా చెత్త డబ్బాను గదికి దూరంగా బయట ఉంచండి. డస్ట్ బిన్ ఎప్పుడూ ఖాళీగా ఉండేలా చూడండి.
గందరగోళం:
అనుకూల శక్తిని ప్రసరింపజేసేవిధంగా, ప్రశాంతతను ప్రోత్సహించే శుభ్రమైన, చక్కటి ప్రాంతాన్ని పూజ స్థలంగా ఎంచుకోండి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో దైవాన్ని మనశ్శాంతిగా ప్రార్థించవచ్చు. ఎలాంటి ఆటకంగాలు, గందరగోళం లేకుండా పూజలు చేసుకోవచ్చు.
పూజ గది ఏ దిశలో ఉండటం మంచిది:
కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజగదిని ఈశాన్య దిక్కులో ఉండే విధంగా చూసుకోవాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. పొరపాటున కూడా పూజగదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతోంది.
Vastu tips in telugu: మీ ఇంట్లో ఫ్యామిలీ ఫొటోలు ఎటు వైపు పెడుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)