చాణక్య నీతి: మీరు బ్యాడ్ పేరెంట్సా - గుడ్ పేరెంట్సా? తల్లిదండ్రులు ఎలా ఉండాలి..ఎలా ఉండకూడదో కొన్ని సూచనలు చేశాడు ఆచార్య చాణక్యుడు వివేకవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే సద్గుణాలతో కూడిన విద్యను అందిస్తారు చిన్నప్పటి నుంచి పిల్లల మనసులో మంచి అనే బీజాలు నాటి వారు సత్ప్రవర్తనతో మెలిగేలా చేస్తారు పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపించని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలపై అధిక ప్రేమ చూపిస్తారో ఆ పిల్లలు తప్పకుండా చెడిపోతారు పిల్లలపై ప్రేమతో వారు చేసే తప్పులు నిర్లక్ష్యం చేస్తే..అందుకు ఫలితం అనుభవించక తప్పదు పిల్లల్ని మందలించడం మహాపాపం అనుకుంటే వారిని చెడుమార్గంలోకి వేలుపట్టి నడిపిస్తున్నట్టే చిన్నారుల భవిష్యత్ చిదిమేసే తల్లిదండ్రులకు ఆ తర్వాత పశ్చాత్తాపపడే హక్కులేదన్నాడు చాణక్యుడు Image Credit: playground.com