ఏటా ఆషాడమాసం విదియ రోజు పూరీ జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జూలై 07 రథయాత్ర

జగాలను ఏలే జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా అందరి కళ్లూ పూరీక్షేత్రంవైపే ఉన్నాయి..

సప్త మోక్షపురి క్షేత్రాల్లో ఒకటైన పూరీ రథయాత్ర సందర్భంగా జనసంద్రంగా మారింది

ప్రపంచంలో అత్యంత పురాతమైన ఈ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైందో కూడా స్పష్టమైన ఆధారాల్లేవ్

జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాందపురాణంలో ఉంది

ఏ ఆలయంలో అయిన ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు..కానీ పూరీ క్షేత్రంలో గర్భగుడిలో విగ్రహాలనే బయటకు తీసుకొస్తారు

ఆలాయాల్లో ఓ రథాన్నే ఏటా వినియోగిస్తుంటారు కానీ పూరీలో ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు

జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజం అని, సుభద్ర రథాన్ని దేవదాలన అని, బలరాముడి రథాన్ని తాళధ్వజం అంటారు

పూరీ ఆలయం నుంచి బయలుదేరిన జగన్నాథుడు 9 రోజుల పాటూ గుండిచా ఆలయం దగ్గర ఉంటాడు

ఆషాడంలో పదో రోజు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో రథయాత్ర సందడి ముగుస్తుంది
Image credit: Twitter X