'బోనాలు' సంబురంలో ఇవి చాలా ప్రధానం!

మొదటిది ఘటోత్సవం : ప్రత్యేకమైన ఘటాలలోకి అమ్మను ఆవాహనం చేసి ఊరేగింపుగా తీసుకెళతారు..

రెండోది బోనాలు సమర్పణ: చల్లంగ చూడమ్మా శక్తి స్వరూపిణికి అంటూ కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే ఆహారాన్ని బోనం అంటారు.

వేపాకు సమర్పించడం: అమ్మకు అత్యంత ప్రీతకరమైన చెట్టు వేపచెట్టు , ఆరోగ్యరీత్యా అద్భుతమైన ఔషధం ఇది...

ఫలహారం బండి: భక్తులు నియమ నిష్టలతో తయారుచేసిన నైవేద్యాన్ని ఫలహార బండ్లలో పెడితే... ఆ బండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది.

పోతురాజు: ఎర్రటి వస్త్రం, కళ్లకు కాటుక, పెద్ద బొట్టు, నడుముకు వేపాకు, చేతిలో కొరడాతో ఫలహార బండిముందు నడుస్తాడు

రంగం : బోనాలలులో చివరి రోజు జరిగే ఈ ఘట్టాన్ని భవిష్యవాణి అంటారు.

బలి: రంగం ముగిసిన మర్నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పట్లో జంతుబలి ఇచ్చేవారు..ఇప్పుడు కూరగాయలు పగులగొడుతున్నారు.

నిమజ్జనం: బలిచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది

జూలై 07 ఆదివారం బోనాలు ప్రారంభం
All Images Credit: Pinterest