జగదాంబికకు తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం

ఆర్భాటంగా ఆషాడబోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

గోల్గొండ కోటలో జరిగే బోనాలకు హాజరుకానున్న దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణలో పాల్గొననున్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం

గోల్గొండలో జరిగే ఉత్సవాలకు హాజరుకానున్న గవర్నర్ రాధాకృష్ణన్

ఆషాఢంలో అమ్మవారిని పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి ప్రత్యేక పూజలు

బోనాలు తీసుకెళ్లే మహిళలపై అమ్మవారు ఉంటుందని భక్తుల విశ్వాసం ...అందుకే ఆలయం సమీపించగానే పసుపునీళ్లతో కాళ్లు కడుగుతారు

ఆషాఢంలో విజృంభించే అంటువ్యాధుల నుంచి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అని వేడుకుంటారు

పూజకోసం ఉపయోగించే వేపాకులు, పసుపునీళ్లు..ఇవన్నీ వైరస్ ను తరిమికొట్టేవే...

జూలై 07 న బోనాలు ప్రారంభం...ఆగష్టు 04 ఆషాడం ముగింపు...
All Images Credit: Pinterest