వినాయక చవితి 2024: ఖైరతాబాద్ గణేష్ రూపం ఇదే!

ఏడాదికో రూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపయ్య ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుతీరనున్నాడు

గణపతిని సప్తముఖాలతో పూజిస్తే ప్రపంచ శాంతితో పాటు , ప్రజలకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం

దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచనల మేరకు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ గణపతి రూపాన్ని నిర్ణయించారు

7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలతో పీఠాన్ని కలుపుకుని 70 అడుగుల ఎత్తుతో భారీ ఆకారంతో రూపొందిస్తున్నారు

గతంలో తయారైన సప్తముఖ గణపతి ఆకారానికి పూర్తి భిన్నంగా ఈసారి గణపతిని తీర్చిదిద్దుతున్నారు

ఉత్సవకమిటీ ఈ నెల 17 న నమూనా చిత్రాన్ని విడుదల చేయనున్నారు

ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు , వెల్డింగ్‌ కళాకారులు పనులు వేగవంతం చేశారు

2024 లో వినాయక చవితి సెప్టెంబరు 7వ తేదీన వచ్చింది
Image Credit: playground.com