చాణక్య నీతి: ఇవి కదా నిజమైన సంపద అంటే!

ఆచార్య చాణక్యుడి బోధనలు ఉన్నతస్థాయికి చేరుకునేందుకు దోహదపడతాయి

ఓ వ్యక్తిజీవితంలో ప్రతి అంశాన్ని వివరించిన చాణక్యుడు..నిజమైన సంపద అంటే ఏంటో కొన్ని సూచనలు చేశాడు

ఆచార్య చాణక్యుడి దృష్టిలో నిజమైన సంపద అంటే..ఆ వ్యక్తి జ్ఞానం, సంకల్ప శక్తి

జ్ఞానం, సంకల్ప శక్తి ఉంటే కష్టం వస్తే కుంగిపోడు..దాన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాడు

జ్ఞాని ఎక్కడికి వెళ్లినా వారి కీర్తి సువాసనగల పూల వాసనలా వ్యాపిస్తుంది

జ్ఞానం, సంకల్ప శక్తి ఉన్నవారు...తన సమస్యలతో పాటూ ఎదుటివారి సమస్యలను కూడా పరిష్కరిస్తాడు

నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఏదైనా పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత ప్రగల్భాలు పలకలరు

అందుకే జ్ఞానం, సంకల్పశక్తి ఉండడం కన్నా గొప్ప ఆస్తి ఏదీ లేదంటాడు చాణక్యుడు
Image Credit: playground.com