![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kondeti Chittibabu: వైసీపీకి మరో షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కొండేటి
Andhrapradesh News: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
![Kondeti Chittibabu: వైసీపీకి మరో షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కొండేటి ysrcp mla kondeti chittibabu joined in congress party Kondeti Chittibabu: వైసీపీకి మరో షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కొండేటి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/e8832969b018c1fdc2494d69f62b3d8f1712994598893876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ysrcp Mla Kondeti Joined In Congress: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. పి.గన్నవరం (P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు (Kondeti Chittibabu) ఆ పార్టీని వీడారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి పార్టీ తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 126 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పి.గన్నవరం సీటును కూడా ఎవరికీ కేటాయించలేదు. మరి ఇక్కడి నుంచి చిట్టిబాబును కాంగ్రెస్ బరిలో నిలుపుతుందా.? అనేది తెలియాల్సి ఉంది. మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనుంది. కాగా, ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కొందరు కాంగ్రెస్ లో చేరితే, మరికొందరు టీడీపీలో చేరారు.
Also Read: Nagarjuna Sagar: తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి కేటాయింపులు - ఏపీ, తెలంగాణకు ఎన్ని టీఎంసీలంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)