YSRCP Support : స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్‌సీపీ ఎటు వైపు ? ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తప్పదా ?
Loksabha YSRCP : లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్‌సీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి నలుగురు ఎంపీల మద్దతు ఉంది.
YSRCP is likely to support NDA : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. స్పీకర్ గా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక అవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పోటీ పెట్టింది. అయితే ఇప్పుడు ఇది కాంగ్రెస్ కూటమికి కొత్త సమస్యలు తెచ్చి పెట్టనుంది. కొన్ని పార్టీలు బీజేపీతో అనవసరంగా వివాదం ఎందుకని ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ తమను కన్సల్ట్ చేయకుండా అభ్యర్థిని పెట్టిందని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి.
అలాగే ఏ కూటమిలో లేని పార్టీలకు కొత్త చిక్కులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వారు ఎటు వైపు నిలడతారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనేసన, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నందున ఆ పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఆ మేరకు ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తారు. మరి వైసీపీ కి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ అధినాయకత్వం నుంచి ఎంపీలకు ఇంకా సమాచారం అందలేదు.
ఇటీవల ఎంపీలతో సమావేశం అయిన జగన్మోహన్ రెడ్డి తమ మద్దతు అంశాల వారీగా ఉంటుందని తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తామని చెప్పినట్లయింది. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నప్పటికీ వైసీపీకి ఉన్న కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల బీజేపీకి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ మద్దతు అడుగుతుందా అన్నది సందేహమే. అలా అడగడం కూటమిలోని కూటమిలోని ఇతర పార్టీలను అవమానించినట్లవుతుంది. అందుకే బీజేపీ వైసీపీ మద్దతును కోరే అవకాశం ఉండదు.
అడగకపోయినా వైసీపీ మద్దతు ఓంబిర్లాకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో రాజకీయంగా గొడవలు పెట్టుకునే పరిస్థితి వైసీపీకి ఉండదు. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పటికీ అదే పంథాను అనుసరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా.. అదే పంథా పాటించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే వైసీపీ ఇండియా కూటమికి దగ్గర అవుతుందని బీజేపీ అనుమానిస్తుంది. అది వైసీపీకి కొత్త సమస్యలు సృష్టిస్తుంది. అందుకే వీలైనంత వరకూ స్పీకర్ ఎన్నిక విషయంలో సైలెంట్ గా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటేసి వచ్చే అఅవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.