News
News
X

YSRCP Colours For NTR Statue : గుడివాడ మహానాడు కంటే ముందే టెన్షన్ టెన్షన్ - ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు !

గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారు. మహానాడు ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

FOLLOW US: 

YSRCP Colours For NTR Statue :   కృష్ణాజిల్లా గుడివాడ కేంద్రం గా రాజ‌కీయం వేడెక్కుతోంది. గుడివాడ‌ను కేంద్రంగా చేసుకొని టీడీపీ జిల్లా మ‌హానాడు కు రెడీ అవుతుండ‌గా...వైఎస్ఆర్‌సీపీ కూడా  పొలిటిక‌ల్ గా టీడీపీకి కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్ప‌టికే జిల్లాలో రెండు పార్టిల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఎకంగా ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ  పార్టీ రంగులు వేసిన ఘటన చోటు చేసుకుంది.  గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ  రంగులు వేశారు.

బొమ్ములూరులో  ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు

టీడీపీ  మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో  బొమ్ములూరు గ్రామం ఉంది. విషయం తెలుసుకొన్న త‌రువాత  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇత‌ర టీడీపీ నేతలు సంఘ‌ట‌నా స్ద‌లానికి వ‌చ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న  రంగులు చెరిపి వేస్తూ పసుపు రంగులు వేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

కొడాలి నాని తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిప‌డ్డారు. మహానాడు బ్యానర్ల పై , అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నార‌ని  మాజీ మంత్రి పిన్నమనేని విమర్శలు గుప్పించారు.  తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమ‌ని పిన్నమనేని చెప్పారు. పార్టీ నాయకులు వెళ్లిన తర్వాత, బొమ్మలూరు టిడిపి కార్యకర్తలపై దాడికి పాల్ప‌డ్డారని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే టీడీపీ,వైసీపీ నేత‌ల మ‌ధ్య ప్ర‌ధానంగా  గుడివాడ‌లో రాజ‌కీయం రంజుగా సాగుతుంది. గుడివాడ‌లో మాజీ మంత్రి కొడాలిని టార్గెట్ చేసిన టీడీపీ, అక్క‌డే జిల్లా మ‌హానాడు నిర్వ‌హించేందుకు భారీగా స‌న్నాహాలు చేస్తోంది. 

మహానాడుకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రయత్నాలు

ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మ‌కూరు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఇక్క‌డ టీడీపీ తిరిగి ప‌ట్టు సాదించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.మాజీ మంత్రి కొడాలిని ఢీ కొట్టేందుకు టీడీపీ అన్ని శ‌క్తుల‌ను కూడ క‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని  టీడీపీ త‌న‌కు అనుకూలంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ విగ్ర‌హానికి వైసీపీ రంగులు వేయ‌టం పై కూడ టీడీపీ ఆందోళ‌న‌ను ఉదృతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. టీడీపీ మ‌హానాడు పై వైసీపీ నాయ‌క‌త్వం కూడ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందున విగ్రహాలకు రంగులు వేస్తే తప్పేమిటని కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Published at : 27 Jun 2022 06:53 PM (IST) Tags: YSRCP tdp Gudivada politics YSRCP colors for NTR statue

సంబంధిత కథనాలు

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Revant Corona :  రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు