YSRCP Plenary : వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ - ఎక్కడంటే ?
వైఎస్ జయంతి సందర్భంగా ప్లీనరీ నిర్వహించే యోచనలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఉన్నారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
YSRCP Plenary : అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించడానికి వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జూలై ఎనిమిదో తేది. ఆ రోజున ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గడప గడప కు మన ప్రభుత్వం జరుగుతోంది. సామాజిక న్యాయ భేరి బస్ యాత్ర ముగిసింది. దీంతో వచ్చే ప్లీనరీ ని భారీ స్థాయిలో నిర్వహించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు.ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి జరిగే మేలు జనం లో వివరించడానికి ఇప్పటికే గడప గడప కు ఎమ్మెల్యేలు నేతలు తిరుగుతున్నారు.
ఐదేళ్లుగా ప్లీనరీ నిర్వహించని వైఎస్ఆర్‌సీపీ
గత ఐదేళ్లుగా వైసీపీ ప్లీనరీ నిర్వహించలేదు . .దీంతో ఈ ప్లీనరీ రి ప్రాధాన్యత ఏర్పడింది. ప్లీనరీ ద్వారా వైసీపీ లో మరింత ఎక్కువగా ఉత్సాహం నింపే విధంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లీనరీ కి భారీగా కార్యకర్తలు, స్థానిక నేతలు, సామాన్య ప్రజలు కూడా రావడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భారీ బహిరంగసభ నిర్వహించే అవకాశం ఉంది.
ప్లీనరీ తర్వాత సీఎం జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
మళ్లీ వైఎస్ఆర్‌సీపీ గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు చెప్పాలని నిర్ణయం
ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా జనం మద్య లోనే చెయ్యడానికి జగన్ రెడీ అవుతున్నారు. పార్టీ ఆవిర్భావం దగ్గరనుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశం ప్లీనరీ లో వివరించనున్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్ సీఎం అయ్యాక మారిన పరిస్థితి మళ్ళీ వైసీపీ ఎందుకు అధికారం లోకి రావాలి ఇవన్నీ కూడా ప్లీనరీ లో వివరిస్తారు. రెండు మూడు రోజుల్లో ప్లీనరీ కి సంబంధించి కమిటీ లు ఏర్పాటు అవుతాయి. ఆ తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుని ప్లీనరీ పై చర్చిస్తారు . వచ్చే నెల 8 9 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో ప్లీనరీ నిర్వహిస్తారని పార్టి నేతలు చెబుతున్నారు.
రెండు, మూడు రోజుల్లో ప్లీనరీ కమిటీల ఏర్పాటు
నిర్వహణకు సంబంధించిన కమిటీలపై సజ్జల రామకృష్ణారెడ్డి వర్కవుట్ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీసభలకు జనం రావడం లేదన్న ప్రచారం జరుగుతూండటంతో... ఆ ప్రచారాన్ని ప్లీనరీ ద్వారా పటా పంచలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మహానాడును మించి ఆదరణ ఉందని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.