News
News
వీడియోలు ఆటలు
X

Telangana Politics : ఇక కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయా ? పొంగులేటి, జూపల్లి తేల్చుకుంటారా?

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు పెరుగుతాయా ?

పొంగులేటి , జూపల్లి నిర్ణయం తీసుకుంటారా ?

రేవంత్ చేరికల్లో తన సత్తా చూపిస్తారా ?

FOLLOW US: 
Share:

Telangana Politics  :   కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి.  ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల  అడుగులు  కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది.  అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు  చర్చలు జరిపారు. 

ఎటూ తేల్చుకోలేకపోతున్న జూపల్లి , పొంగులేటి                             
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం  చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.  అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఎంత షాకిచ్చాయో.. పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని... బీజేపీలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. 

బీజేపీకి ఇక  హైప్ లేనట్లేనని భావిస్తున్నారా?                              

ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. ఇదే బాటలో జూపల్లి కూడా నడవబోతున్నారని అంటున్నారు.  కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామని రాష్ట్ర నేతలు ఎప్పటి నుంచో వారందరికీ సర్ది చెబుతున్నారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టే అవకాశం ఉంది. 

బీజేపీలో చేరికలు ఇక కష్టమే !

బీజేపీని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగుపుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు ఆయనకు ఇక ఎలాంటి చేరికలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బీజేపీ ఈ నిరాశలోనే ఉండనుంది. 

Published at : 14 May 2023 08:00 AM (IST) Tags: Revanth Reddy Telangana Politics Congress Party Joining Telangana Congress

సంబంధిత కథనాలు

Sharmila Meet Sivakumar  : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ -  కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

TDP Mahanadu: జగన్ ది రాక్షసపాలన, ఎటు చూసినా దోపిడీ! మహానాడులో టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు

TDP Mahanadu: జగన్ ది రాక్షసపాలన, ఎటు చూసినా దోపిడీ! మహానాడులో టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా