అన్వేషించండి

YCP Leaders Silent: వైఎస్ఆర్‌సీపీ సీనియర్ల ఆజ్ఞాత రాజకీయం - వ్యూహమా? భయమా?

YCP Leaders Underplay: వైసీపీలో సగానికి పైగా సీనియర్ నేతలు ఇంకా ఎందుకు ఫీల్డ్‌లోకి రావడం లేదు? వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గోడమీద పిల్లుల్లా ఉన్నారా?

Why YSRCP Senior Leaders Are Silent After Election: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ప్రజా క్షేత్రంలో కదలికలు తగ్గడంతో.. పార్టీలోని ద్వితీయ శ్రేణి, ముఖ్యంగా సగానికి పైగా సీనియర్ నాయకులు పూర్తిగా  ఫీల్డ్ కు దూరమయ్యారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకు, అటు రాయలసీమ కోటల వరకు ఒకప్పుడు ఉద్దండ పిండాలుగా వెలిగిన వైసీపీ సీనియర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో ముఖం చాటేస్తున్నారు. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కుదరకపోవడమా? లేక మారుతున్న రాజకీయ సమీకరణాలతో గోడ మీద పిల్లి  వాటంగా వ్యవహరిస్తున్నారా?  

 ప్రెస్ మీట్లకే పరిమితమైన  యాక్టివిజం 

ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్న కొద్దిమంది నేతలు సైతం కేవలం తాడేపల్లి కేంద్రంగా లేదా వారి వ్యక్తిగత కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడటం వంటి పనులకు వీరు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం మైకుల ముందు ఘాటు విమర్శలు చేసి, సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలవడమే రాజకీయం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది.

 వారసుల భవిష్యత్ కోసం గోడ మీద పిల్లి  వాటం 

ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు గమనిస్తే.. చాలా మంది సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఇప్పుడు వారి ప్రధాన ఆందోళన అంతా తమ వారసుల రాజకీయ భవిష్యత్తు గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరఫున గట్టిగా నిలబడి అధికార కూటమి పై పోరాడితే, భవిష్యత్తులో తమ వారసులకు పొలిటికల్ కెరీర్ లేకుండా పోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే అధికార పక్షంతో అనవసరమైన వైరాన్ని కొనితెచ్చుకోకుండా, తమ వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకుంటూ  అండర్ ప్లే చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

 రాయలసీమలోనూ అండర్ ప్లే రాజకీయం 

వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాక్షన్, పంతాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సీమ నియోజకవర్గాల్లో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా సైలెంట్ అయిపోయారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అధికార పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం ద్వారా ప్రస్తుత గండం నుంచి గట్టెక్కవచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదనే ఒక అలిఖిత నిబంధనను వారు పెట్టుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

 జగన్ ఫుల్ టైమ్ రాకపోవడమే ప్రధాన మైనస్ 

నాయకులలో ఈ స్థాయి స్తబ్దత రావడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శైలి కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పూర్తిగా వీధుల్లోకి వచ్చి, నిరంతరాయంగా ప్రజా పోరాటాలు చేయకపోవడంతో కింది స్థాయి నేతలకు కూడా ఆ అవసరం కనిపించడం లేదు. అధినేతే తాడేపల్లి ,  బెంగళూరు ప్యాలెస్‌లకే పరిమితమైతే, తాము మాత్రం రోడ్లెక్కి కేసులు ఎందుకు పెట్టించుకోవాలనే ధోరణి సీనియర్లలో బలంగా నాటుకుపోయింది. లీడర్ షిప్ నుంచి స్పష్టమైన యాక్షన్ ప్లాన్, భరోసా లేకపోవడమే ఈ రాజకీయ శూన్యతకు ప్రధాన కారణం.

 మంచి అవకాశం వస్తే  జంప్ అయ్యేందుకేనా? 

ఈ సుదీర్ఘ నిశ్శబ్దం వెనుక మరో పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం తటస్థంగా ఉంటూ, రాబోయే రోజుల్లో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వైపు దూకేందుకు  వీరు మానసికంగా సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఏవైనా అసంతృప్తులు తలెత్తినా లేదా కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినా.. తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోయేందుకు వీలుగానే వీరు ఏ పార్టీని తీవ్రంగా దూషించకుండా సేఫ్ గేమ్  ఆడుతున్నారు. సరైన సమయం, సరైన అవకాశం వస్తే వీరంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

 ఈ పరిస్థితి మారకపోతే కష్టమే.. 

వైసీపీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ  సైలెంట్ మోడ్ వ్యూహం ఎంతమాత్రం పనికిరాదు. జగన్ వెంటనే ఫీల్డ్‌లోకి వచ్చి సీనియర్లలో నమ్మకాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. అలా కాకుండా ఇదే స్తబ్దత మరికొన్ని నెలలు కొనసాగితే, రాబోయే రోజుల్లో వైసీపీ కేవలం బోర్డులకే పరిమితమై, నేతలంతా ఇతర పార్టీల వైపు వలస వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో పోరాడేవాడే నాయకుడిగా నిలబడతాడు తప్ప, గోడ మీద పిల్లిలా ఉంటే రాజకీయం పిల్లిమొగ్గలు వేయడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా  వేస్తున్నాయి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget