అన్వేషించండి

Brother Anil : "పార్టీ" ఉద్దేశం లేకపోతే "రాజకీయ భేటీలు" ఎందుకు ? బ్రదర్ అనిల్ పార్టీ ఖాయమేనా ?

వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ రాజకీయ సమావేశాలు పెట్టడంపై ఏపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. పార్టీపై చెప్పారని సమావేశంలో పాల్గొన్నవారు చెబితే.. అలాంటిదేమీ లేదని అనిల్ క్లారిటీ ఇచ్చారు. కానీ నిప్పు లేకుండా పొగ రాదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను డైనమిక్‌గామారుతున్నాయి. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తర్వాత ఆయన అలాంటిదేమీ లేదని.. ఏమైనా ఉంటే తానే చెబుతానని క్లారిటీ ఇచ్చారు. కానీ రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు. పొగ వచ్చిందంటే ఏదో ఉందనే అర్థం. ఇప్పటికే ఈ పొగ ఏపీ రాజకీయాల్లో ఉంది. అందుకే బ్రదర్ అనిల్ పార్టీపై ఏపీలో ఆసక్తి ప్రారంభమైంది.

కలకలం రేపిన బ్రదర్ అనిల్ "రాజకీయ" సమావేశం 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడిగా తెలుగు ప్రజలకు బ్రదర్ అనిల్ కుమార్ అందరికీ తెలుసు. అయితే ఆయనకంటూ క్రైస్తవసమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.  మత ప్రచారకుడిగా ఆయనకు తెలుగురాష్ట్రాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. తెర వెనుక ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ... తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం క్రైస్తవ సమాజం మద్దతు కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. ఆయన కృషి ఫలితంగానే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలవాలని.. ఇటీవల జగన్ గెలవాలని చర్చిల్లో ప్రార్థనలు కూడా చేశారని చెప్పకున్నారు. ఈ ప్రయత్నాల కారణంగానే బ్రదర్ అనిల్ కుమార్‌కు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన ఇప్పటి వరకూ ప్రత్యక్ష  రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. రాజకీయాల గురించి మాట్లాడిందిలేదు. కానీ ఇటీవల మాత్రం ఆయన అడుగులు రాజకీయ పరంగానే కనిపిస్తున్నాయి.

అనిల్ పార్టీ పెట్టే అవకాశం ఎంత !?

బ్రదర్ అనిల్ ఇటీవల ఏపీలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఓ సారి కృష్ణా జిల్లాలో పర్యటించారు. తర్వాత రాజమండ్రి వెళ్లి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. అప్పుడు కాస్త నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయన్నారు. ఇప్పుడు విజయవాడలో నేరుగా వైఎస్ఆర్‌సీపీ గెలుపు కోసం ప్రయత్నించిన క్రైస్తవ, బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అంతర్గత సంభాషణల్లో సొంత పార్టీ గురించి చెప్పినట్లుగా ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పారు. అయితే బహిరంగంగా మాత్రం అనిల్ కుమార్ ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే బ్రదర్ అనిల్ ఇప్పటి వరకూ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేదు. ఒక్క సారిగా పార్టీ ప్రారంభిస్తారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. నమ్మలేకపోయారు కూడా. కానీ వైఎస్ కుటుంబంలో గత కొన్ని నెలల పరిణామాలు చూస్తే కొట్టి పారేయలేమని కొంత మంది వాదిస్తున్నారు. 

"ప్లాన్ బీ"లో భాగంగా షర్మిలనే ఏపీలో రాజకీయ పార్టీ పెట్టిస్తున్నారా ?

వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఆమె ఏపీరాజకీయాల్లోనూ అడుగుపెడతారన్న ప్రచారం జరిగింది. దానికి ఆమె వ్యాఖ్యలు కూడా కారణం అయ్యాయి.ఏపీలో పార్టీ పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని ప్రశ్నించారు. అయితే తర్వాత కేవలం తాను రూల్ గురించి మాట్లాడానని.. తన రాజకీయ జీవితం పూర్తిగా తెలంగాణకే అంకితమని క్లారిటీ ఇచ్చారు. కానీ కుటుంబ వివాదాలు...తెలంగాణలో పార్టీకి లభించే ఆదరణ ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని.. ప్రత్యామ్నాయంగా షర్మిలనే .. తన భర్తతో  ఏపీలో పార్టీ ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలేమీ లేకపోతే బ్రదర్ అనిల్ ఎందుకు సమావేశాలు పెడతారనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న మౌలికమైన ప్రశ్న. 

బ్రదర్ అనిల్ ముందడుగు వేస్తే రాజకీయంగా కీలక పరిణామాలు !

బ్రదర్ అనిల్ కుమార్ ఏ ఉద్దేశంతో సమావేశాలు పెడుతున్నారో స్పష్టతలేదు. ఆ విషయం ఆయనే చెప్పాల్సింది. వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేసినవారందరూ ఆవేదనకు గురవుతున్నారని ఆయన  చెబుతున్నారు. ప్రచారం చేసి గెలిపించిన పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో సభలు పెడతారని అంటున్నారు. అదే జరిగితే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతోనే అని అనుకోవాలి. బ్రదర్ అనిల్ ముందడుగు వేస్తే ఏపీ రాజకీయాల్లో ఓ రకమైన కల్లోలం ఖాయమని అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget