By: ABP Desam | Updated at : 31 Mar 2022 08:45 PM (IST)
కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదాకు కారణమేంటి ?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేదు. బుధవారం ఉదయం హఠాత్తుగా టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ ఢిల్లీకి బయలు దేరుతున్నారని మీడియాకు సమాచారం ఇచ్చాయి. పదిన్నరకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని చెప్పారు. అయితే సాయంత్రానికి కూడా ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. ఆయన పర్యటన క్యాన్సిల్ అయిందని.. ఢిల్లీలో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకున్న వైద్యుడు అందుబాటులో లేరని అందుకే వెళ్లలేదని సమాచారం ఇచ్చారు. వైద్యుడు అందుబాటులోకి వచ్చాక వెళ్తారన్నారు. కేసీఆర్‌కు దంత సమస్యలు వస్తే కేంద్రమంత్రిగా ఉన్నప్పటి నుండి ఢిల్లీలోని వైద్యుని దగ్గరే చికిత్స చేయించుకునేవారు. ఇప్పుడు కూడా ఆయన వద్దకు వెళ్లాలనుకున్నారు. అయితే చివరి క్షణంలోవాయిదా పడింది.
మెట్రో ప్రయాణికులకు భారీ ఆఫర్, రోజంతా ఎన్నిసార్లైనా, ఎక్కడికైనా - ఈ రోజుల్లోనే
అయితే వైద్యుడి కోసమే కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లరని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోసం కేసీఆర్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే వెళ్లి కలవాలనుకుంటున్నారని బుధవారం లేదా గురువారం అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని ప్రాధమిక సమాచారం రావడంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నారని చెబుతున్నారు. అయితే అపాయింట్మెంట్ విషయంలో చివరి వరకూ క్లారిటీ లేకపోవడంతో ఆగిపోయారంటున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారయిన తర్వాత కేసీఆర్ ఢిల్లీపర్యటన ఉంటుందని చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్
బీజేపీపై టీఆర్ఎస్ ఓ రకంగా యుద్ధం ప్రకటించింది. తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌తో కేంద్రమంత్రుల్ని కలిసేందుకు ప్రత్యేకంగా టీఆర్ఎస్ బృందం వెళ్లింది. అక్కడ టీఆర్ఎస్ మంత్రులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విరుచుకుపడ్డారు. వరి పోరాటం ప్రకటించిన సమయంలో... కేసీఆర్ అవసరం అయితే తాను కూడా ప్రధానితో భేటీ అవుతానని ప్రకటించారు. అప్పట్నుంచి ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ వరి రైతులకు న్యాయం జరగాలంటే ఆపని చేయండి- కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సలహా
అయితే ధాన్యం విషయం తెలంగాణ సర్కార్ రాజకీయం చేస్తోందన్న అభిప్రాయంతో బీజేపీ ఉంది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని కూడా .. మళ్లీ ధాన్యం మొత్తం కొనాలని రైతుల్ని రెచ్చగొడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోకేసీఆర్ ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని కదిలిస్తానని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ పర్యటన గురించి ప్రకటించినా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>