అన్వేషించండి

AP DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ - ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు జైలు నుంచి.. ఏపీ ప్రజలు, టీడీపీ శ్రేణులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

కుటుంబ సభ్యులతో ములాఖత్ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు లేఖ రాయాలని కోరారు. దీంతో.. ఆయన చెప్పిన అంశాలను పొందుపరిచి చంద్రబాబు పేరిట కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేశారు. ఈ లేఖ చదివిన టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతుదారులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు గత నెలన్నరకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం తెలిసిందే. తాను జైల్లో లేనని ప్రజల గుండెల్లో ఉన్నా... తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారని చెప్తున్న లేఖపై విచారణ జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారం, జైల్లో భద్రతపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి ఎటువంటి లేఖ బయటకు వెళ్లలేదని జైలు అధికారులు చెప్తున్నారని రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని అన్నారు. జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన లేఖపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్..

ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్‌, బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యచరణ భేటీపై బాబుతో లోకేష్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమండ్రిలో మధ్యాహ్నం 3 గం.లకు జరగనుంది.

ఈ సమావేశానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నారా లోకేశ్, బ్రాహ్మణితో ములాఖత్ సందర్భంగా చంద్రబాబు కోరారని టీడీపీ నేత చినరాజప్ప మీడియాకు తెలిపారు.

తాను జైల్లో లేను ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది. చంద్రబాబు నాయుడి పేరుతో నారా లోకేశ్ ఈ ఫేక్ లేఖను విడుదల చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై విచారణ జరిపిస్తామని ఏపీ డీజీపీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget