News
News
X

YS Vijayamma : మీ బిడ్డల భవిష్యత్ జగన్ చేతుల్లో పెట్టండి, మంచి భవిష్యత్ ఇస్తాడు - ఏపీ ప్రజలకు విజయమ్మ పిలుపు !

పిల్లల భవిష్యత్ జగన్ చేతుల్లో పెట్టాలని ప్రజలకు విజయమ్మ పిలుపునిచ్చారు. ప్లీనరీలో ఆమె మాట్లాడారు.

FOLLOW US: 

 YS Vijayamma :  ఏపీ ప్రజలు తమ బిడ్డలను జగన్ చేతుల్లో పెట్టాలని మంచి భవిష్యత్ ఇస్తాని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ప్లీనరీలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించానికి ముందుగా ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌ అందరివాడని.. కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందన్నారు.ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్‌ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

వైసీపీకి రాజీనామా, ప్లీనరీలో విజయమ్మ సంచలన ప్రకటన

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ‘‘జగన్‌ చెప్పినవే కాకుండా చెప్పనవీ కూడా చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేశాం కాబట్టే ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రూ.1.60 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని’’ వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు.‘‘వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌. యువతకు రోల్‌ మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్‌ చూసుకుంటారని’’ వైఎస్‌ విజయమ్మ భరోసా ఇచ్చారు. 

గజదొంగల ముఠా మొత్తం మెక్కేసింది, ఇదంతా మన ఖర్మ కొద్దీ చూస్తున్నాం : వైఎస్ జగన్ ధ్వజం

  వైఎస్సార్‌ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్‌ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్‌ జగన్‌ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో  ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి.  వైఎస్సార్‌ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్‌ గెలుస్తారు అని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

రాహుల్‌ని ప్రధాని చెయ్యాలనేది వైఎస్ కోరిక, అలా జరిగితేనే ఆత్మకు శాంతి: రేవంత్ రెడ్డి

విజయమ్మ ప్లీనరీకి వస్తారా రారా అని చివరి క్షణం వరకూ ఉత్కంఠ నెలకొంది. అయితే  ఇడుపులపాయలో నివాళి అర్పించిన తర్వాత ఆమె జగన్‌తో కలిసి ప్లీనరీకి బయలుదేరారు. 

Published at : 08 Jul 2022 01:08 PM (IST) Tags: ycp Vijayamma resignation from YSRCP Vijayamma Vijayalakshmi

సంబంధిత కథనాలు

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Revant Corona :  రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!