అన్వేషించండి

Varla On AP CID : హత్య చేసిన అనంతబాబునూ అంత సేపు ప్రశ్నించలేదే ? సీఐడీపై టీడీపీ తీవ్ర విమర్శలు !

ఏపీ సీఐడీ తీరుపై వర్ల రామయ్య విమర్శలు చేశారు. హత్య కేసులో ఉన్న అనంతబాబును కూడా ప్రశ్నించనంత సేపు గౌతు శిరీషను ప్రశ్నించారని మండిపడ్డారు.

Varla On AP CID  :   సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారని టీడీపీ నేత గౌత శిరీషను ఏడు గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారుల తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ సీఐడీ దారి తప్పిందని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.  ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునే విషయంలో అధికార పార్టీకి సీఐడీ పావుగా ఉపయోగపడుతోందని.. సీఐడీ చీఫ్ సునీల్ కుమారును సీఎం జగన్, సజ్జల బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.  సునీల్ కుమార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో సునీల్ కుమారుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కన్పిస్తోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.  సునీల్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చి.. సీఐడీ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని..  సీఎం జగన్, సజ్జల చేతులో తాను ఎందుకు పావుగా మారారో సీఐడీ చీఫ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

లుక్‌ఔట్ నోటీసులో ఉన్న పంచ్‌ ప్రభాకర్‌ను ఎలా కలిశారు ?

పంచ్ ప్రభాకర్ మీద సీబీఐ లుక్ అవుట్ నోటీసిస్తే.. ఆయన్ను విదేశాల్లో ఎంపీ మిధున్ రెడ్డి కలిశారన్నారు.  సీఎం జగన్‌ను కూడా  పంచ్ ప్రభాకర్ కలిశారని వర్ల రామయ్య ఆరోపించారు. లుక్ అవుట్ నోటీసు పరిధిలో ఉన్న పంచ్ ప్రభాకరును ఎంపీ మిధున్ రెడ్డి స్థానిక పోలీసులకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. పంచ్ ప్రభాకర్-మిధున్ రెడ్డి భేటీ విషయాన్ని హైకోర్టు కూడా సీరియస్సుగా తీసుకోవాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఎవరికి అంతు చిక్కని కేసులను విచారణ చేయాల్సిన సీఐడీ విభాగాన్ని  సోషల్ మీడియా కేసులకు ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.  

హత్య చేసిన అనంతబాబు ను అంత సేపు ప్రశ్నించలేదేం?

టీడీపీ నేత  గౌతు శిరీషను ఏడు గంటల పాటు విచారణ చేయడం ఏమిటని ... భోజనానికి కూడా వెళ్లనివ్వకుండా శిరీషను విచారించడం ఏమిటని ప్రశ్నించారు. గౌతు శిరీష ఏం తప్పు చేశారు..?గౌతు లచ్చన్న మనవరాలను అవమానిస్తారా..? డ్రైవరుని హత్య చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కూడా ఇన్ని గంటలపాటు విచారణ చేయలేదని గుర్తు చేశారు.  లోకేష్ పేరు చెప్పమని విచారణకు పిలిచిన వారిని ఒత్తిడి తెస్తున్నారు. లోకేష్ మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 

అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా కేసులపై కమిషన్

సీఐడీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరికాదని..  సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం చేస్తున్నారంటూ 26 ఫిర్యాదులు చేశాను.. ఏం చర్యలు తీసుకున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే సోషల్ మీడియా కేసులైప ఓ కమిషన్ వేస్తామన్నారు.  మేం ఇచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో సీఐడీ శ్వేతపత్రం విడుదల వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget